Sunil Gavaskar : రోహిత్ కెప్టెన్సీ నిరాశప‌రిచింది.. ఆట‌గాళ్ల మ‌ధ్య గ్యాప్ పెర‌గ‌డానికి అది ఓ కార‌ణం

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి నుంచి సార‌థ్య బాధ్య‌త‌లు అందుకున్నాడు రోహిత్ శ‌ర్మ‌. ఆసియా క‌ప్‌, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, డ‌బ్ల్యూటీసీ పైన‌ల్‌ రోహిత్ సార‌థ్యంలో ఆడిన‌ప్ప‌టికి భార‌త్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

Sunil Gavaskar : రోహిత్ కెప్టెన్సీ నిరాశప‌రిచింది.. ఆట‌గాళ్ల మ‌ధ్య గ్యాప్ పెర‌గ‌డానికి అది ఓ కార‌ణం

Rohit Sharma-Sunil Gavaskar

Sunil Gavaskar-Rohit Sharma : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) నుంచి సార‌థ్య బాధ్య‌త‌లు అందుకున్నాడు రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma). 2013లో ధోని (MS Dhoni) నాయ‌క‌త్వంలో టీమ్ఇండియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచింది. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో ఐసీసీ ట్రోఫీని ముద్దాడ‌లేక‌పోయింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ కెప్టెన్సీలోనైనా ఈ కోరిక తీరుతుంద‌ని అభిమానులు ఆశించ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటిది జ‌ర‌గ‌లేదు. ఆసియా క‌ప్‌, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, డ‌బ్ల్యూటీసీ పైన‌ల్‌ రోహిత్ సార‌థ్యంలో ఆడిన‌ప్ప‌టికి భార‌త్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

WI vs IND : వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త బ్యాట‌ర్లు ఎవ‌రో తెలుసా..?

దీంతో రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి తొల‌గించాల‌ని డిమాండ్లు పెరుగుతున్నాయి. స్వ‌దేశంలో జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గ‌నుక టీమ్ఇండియా సాధించ‌క‌పోతే రోహిత్ ను కెప్టెన్‌గా తొల‌గించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త లిటిల్ మాస్ట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీ ప‌ట్ల తాను సంతృప్తి చెంద‌లేద‌ని సునీల్ గ‌వాస్క‌ర్ అన్నారు.

కెప్టెన్‌గా అత‌డి నుంచి మ‌రింత మంచి ప్ర‌ద‌ర్శ‌న‌ను ఆశిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. టీమ్ఇండియా స్వ‌దేశంలో గెల‌వ‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌ని కాద‌ని, విదేశాల్లో గెలిచిన‌ప్పుడే మ‌న స‌త్తా ఎంటో తెలుస్తుంద‌న్నాడు. విదేశాల్లో రోహిత్ సార‌థ్యం త‌న‌ను నిరాశ ప‌రిచిన‌ట్లు చెప్పారు. అటు టీ20ల్లోనూ పెద్ద‌గా రాణించింది ఏమీ లేద‌ని, స్టార్ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికి జ‌ట్టు క‌నీసం ఫైన‌ల్‌కు కూడా చేర‌క‌పోవ‌డం బాధ‌క‌లిగించింద‌న్నాడు.

WI vs IND : భార‌త్‌తో తొలి టెస్టు.. విండీస్ భారీ కాయుడు వ‌చ్చేశాడు

ఒక‌ప్పుడు జ‌ట్టులోని ఆట‌గాళ్లు అంద‌రూ స్నేహితుల్లా ఉండేవార‌ని, ఇప్పుడు కేవ‌లం కొలిగ్స్‌లా ఉంటున్నార‌ని ఇటీవ‌ల సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీనిపైన కూడా గ‌వాస్క‌ర్ స్పందించాడు. స‌హ‌చ‌రుల మ‌ధ్య ప్రేమ‌, అభిమానం లోపించ‌డం చాలా బాధాక‌ర‌మ‌న్నాడు. జ‌ట్టుగా రాణించ‌లేక‌పోవ‌డానికి ఇదీ ఓ కార‌ణమ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. “మ్యాచ్ ముగిసిన వెంట‌నే ప్లేయ‌ర్లు అంద‌రూ ఓ చోట కూర్చోని మాట్లాడుకోవాలి. అదీ మ్యాచ్ గురించే కాదు.. ఇంకా చాలా విష‌యాలు మాట్లాడుకోవ‌చ్చు. సినిమాలు, సంగీతం ఏదైనా కానివ్వండి. అప్పుడే ఆట‌గాళ్ల మధ్య బంధం బ‌ల‌ప‌డుతుంది. గ‌తంలో ఆట‌గాళ్లంద‌రికి ఒక‌టే రూమ్‌ను ఇచ్చేవారు.. మ‌రీ ఇప్పుడు ప్ర‌తి ఆట‌గాడికి ఒక్కో రూమ్‌ను కేటాయిస్తున్నారు. ఆట‌గాళ్ల మ‌ధ్య గ్యాప్ పెర‌గ‌డానికి ఇదీ ఓ కార‌ణం కావ‌చ్చు.” అని గ‌వాస్క‌ర్ అన్నారు.

BCCI New Rules : బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. క్రికెట్‌లో కొత్త రూల్‌.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ నిబంధ‌న‌లో స్వ‌ల్ప మార్పు