Rajinikanth : హెల్త్ చెకప్ కోసం రజినీకాంత్ అమెరికా పయనం..

యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవడానికి ఈ తెల్లవారుజామున సూపర్‌స్టార్ రజినీకాంత్ యూఎస్ వెళ్లారు..

Rajinikanth : హెల్త్ చెకప్ కోసం రజినీకాంత్ అమెరికా పయనం..

Superstar Rajinikanth Left For The Us Early Today For His Annual Medical Check Up

Updated On : July 1, 2021 / 11:58 AM IST

Rajinikanth: కొద్దిరోజుల క్రితం సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో సినిమా పరిశ్రమ వారు, అభిమానులు షాకయ్యారు. ఇటీవలే అనారోగ్యం నుండి కోలుకున్న రజినీ గురించి ఇలాంటి వార్త ఏంటంటూ కంగారు పడ్డారు.

అయితే హెల్త్ చెకప్ కోసం రజినీ అమెరికా వెళ్లారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవడానికి ఈ తెల్లవారుజామున సూపర్‌స్టార్ చెన్నై నుండి రెగ్యులర్ ఫ్లైట్‌లో దోహా (ఖతర్ క్యాపిటల్) చేరుకుని, అక్కడినుండి కనెక్టింగ్ ఫ్లైట్‌లో యూఎస్ వెళ్లారు.

కొన్నాళ్లక్రితం అనారోగ్యం నుండి కోలుకున్న రజినీ కాంత్, ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీకిగాను బ్యాలెన్స్ ఉన్న తన పోర్షన్ షూటింగ్‌ను సింగిల్ షెడ్యూల్‌లో కంప్లీట్ చేసేశారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది.