T20 World Cup-2022: సూర్య ప్రపంచ ఉత్తమ ఆటగాడు.. టీ20ని మరో స్థాయికి తీసుకెళ్లాడు: ఇంగ్లండ్ ఆల్ రౌండర్

‘‘సూర్యకుమార్ యాదవ్ గొప్ప ఆటగాడు. అతడే ప్రపంచ ఉత్తమ ఆటగాడని నా అభిప్రాయం. టీ20 క్రికెట్ ను మరోస్థాయికి తీసుకెళ్లాడని భావిస్తున్నాను. సూర్యకుమార్ యాదవ్ క్రీజులో బాగా ఆడుతున్న సమయంలో అతడిని కట్టడి చేయలేం. అటువంటి మొట్టమొదటి బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ మాత్రమేనని భావిస్తున్నాను. అతడి బలహీన పాయింటు ఏంటో తెలుసుకోలేం’’ అని మోయీన్ అలీ చెప్పాడు.

T20 World Cup-2022: సూర్య ప్రపంచ ఉత్తమ ఆటగాడు.. టీ20ని మరో స్థాయికి తీసుకెళ్లాడు: ఇంగ్లండ్ ఆల్ రౌండర్

T20 World Cup-2022: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ను పలు దేశాల ఆటగాళ్లు ఆకాశానికెత్తేస్తున్నారు. ఎల్లుండి ఇంగ్లండ్ తో టీమిండియా సెమీఫైనల్ ఆడనున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మోయీన్ అలీ ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సూర్యకుమార్ యాదవ్ ఆటతీరును ప్రశంసించడం గమనార్హం.

‘‘సూర్యకుమార్ యాదవ్ గొప్ప ఆటగాడు. అతడే ప్రపంచ ఉత్తమ ఆటగాడని నా అభిప్రాయం. టీ20 క్రికెట్ ను మరోస్థాయికి తీసుకెళ్లాడని భావిస్తున్నాను. సూర్యకుమార్ యాదవ్ క్రీజులో బాగా ఆడుతున్న సమయంలో అతడిని కట్టడి చేయలేం. అటువంటి మొట్టమొదటి బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ మాత్రమేనని భావిస్తున్నాను. అతడి బలహీన పాయింటు ఏంటో తెలుసుకోలేం’’ అని మోయీన్ అలీ చెప్పాడు.

కాగా, సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవలే అతడు ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మొహమ్మద్ రిజ్వాన్ ను సూర్యకుమార్ యాదవ్ వెనకేశాడు. ఎల్లుండి జరగనున్న సెమీఫైనల్ లో అతడు మరింత చెలరేగి ఆడే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..