F3 Movie: ‘లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా’.. ఎఫ్3 నుండి పూజా హెగ్డే సాంగ్ రిలీజ్!

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్3’ను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, షూటింగ్ పనులు ముగించుకుని మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

F3 Movie: ‘లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా’.. ఎఫ్3 నుండి పూజా హెగ్డే సాంగ్ రిలీజ్!

F3

F3 Movie: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్3’ను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, షూటింగ్ పనులు ముగించుకుని మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మరింత ఫన్‌తో నింపి ప్రక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు పూర్తి ఫన్ ఇచ్చేందుకు అనిల్ రావిపూడి అండ్ గ్యాంగ్ సిద్ధమయ్యారు.

F3 Movie: డబుల్ డోస్ ఫన్‌కు తోడైన జిగేల్ రాణి.. రిజల్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో?

కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను అప్పుడే చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఎఫ్3 సినిమాలోని పాటలను రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే లబ్బు డబ్బు, ఊ ఆ ఆహా ఆహా అనే పాటలతో రచ్చ చేసిన ఎఫ్ 3 టీమ్ తాజాగా తమన్నా స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ చేసింది. పార్టీ సాంగ్ గా తెరకెక్కించిన ఈ పాట.. లైఫ్ అంటే మినిమమ్ ఇట్లా ఉండాలా అంటూ లిరికల్ తో మొదలైంది. ఈ పాటలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా పూజా హెగ్డే వేసిన స్టెప్పులు హైలైట్ గా ఉన్నాయి.

F3 Movie: ఆరో భూతం మనీ.. సమ్మర్ హీట్‌లో ఫన్ ట్రీట్ ‘ఎఫ్3’

ఒక వ్యక్తి పెద్ద కలలను కలిగి ఉండాలని, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనే సందేశాన్ని ఇస్తున్న ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి పాడారు. స్పైసీ సైరన్ పూజా హెగ్డే ఈ పాటలో గ్లామర్ విందును అందిస్తోంది. ఈ పాటతో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రిన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా సోనాల్ చౌహన్ కూడా మరో పాత్రలో నటించింది. ఈ పాట చూస్తే తమన్నా, మెహ్రీన్, సోనాల్ గ్లామర్ కు తోడు తమన్నా గ్లామరస్ డాన్స్ ట్రీట్ మరింత అడ్వాంటేజ్ కానున్నట్లుగా కనిపిస్తుంది.