Tamil Nadu : హత్యకు గురైన ఎస్ఐ కుటుంబానికి రూ. కోటి  పరిహారం..ఒకరికి ఉద్యోగం

కుటుంబానికి అండగా ఉంటామని, వారి కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయంతో పాటు...కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.

Tamil Nadu : హత్యకు గురైన ఎస్ఐ కుటుంబానికి రూ. కోటి  పరిహారం..ఒకరికి ఉద్యోగం

Cm Stalin

Tamil Nadu SI Murder : మేకల దొంగలు ఎస్ఐ భూమినాథన్ ను దారుణంగా హత్య చేసిన ఘటనపై సీఎం స్టాలిన్ స్పందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని, వారి కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయంతో పాటు…కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. నిందితులను పట్టుకొనేందుకు 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ఎస్ఐ దారుణ హత్యతో తీవ్ర కలకలం రేపింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసుల హత్యను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం రూపొందించాలని సూచించారు. మరోవైపు..సోలమానగర్ లో ఆయన స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ తామరైకణ్నన్, ఐజీ బాలకృష్ణన్, డీఐజీ శరవన సుందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భూమినాథన్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read More : UP Election : యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ

అసలు ఏం జరిగింది ?

తిరుచ్చి జిల్లా నవల్ పట్టుకు చెందిన ప్రత్యేక ఎస్ఐ భూమినాథన్ (53)…శనివారం రాత్రి పుదుక్కోట్టై జిల్లా కీరనూర్ సమీపంలోని కలమాపూర్ వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో..ఆదివారం తెల్లవారుజామున మేకలతో వెళుతున్న ఇద్దరిపై అనుమానం వచ్చి..అడ్డుకొనే ప్రయత్నం చేశారాయన. వాళ్లు ఆపకుండా పోవడంతో…భూమినాథన్ మరో పోలీసుతో చిత్తిరైవేల్ వేర్వేరుగా బైకులపై వారిని వెంబడించారు. పుదుక్కోట్టై కీరనూర్ ప్రాంతంలో మాటు వేసిన దొంగలు భూమినాథన్ ను బంధించి..పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వారు వచ్చేలోపు…కొడవలితో కిరాతకంగా హత్య చేశారు. రక్తపుమడుగులో ఉన్న భూమినాథన్ చూడగానే..పోలీసులు షాక్ తిన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించి..మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని…తిరుచ్చి జీజీహెచ్ కు తరలించారు. తిరుచ్చి నగర పోలీసు కమిషనర్, పుదుక్కోట్టై ఎస్పీ ఘటనాస్థలిని పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.