7 Year boy Priest :ఆలయంలో పూజారిగా ఏడేళ్ల బాలుడు..దేవాదయ శాఖపై కోర్టు ఫైర్

అమ్మవారి ఆలయంలో పూజారిగా ఏడేళ్ల బాలుడిని నియమించటంతో ..దేవదయ శాఖపై హైకోర్టు మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.

7 Year boy Priest :ఆలయంలో పూజారిగా ఏడేళ్ల బాలుడు..దేవాదయ శాఖపై కోర్టు ఫైర్

Madras Hc

Tamilanadu :  తమిళనాడులోని నీలగిరిలో అమ్మవారి ఆలయంలో పూజారిగా సుమారు ఏడేళ్ల వయస్సున్న బాలుడు పూజారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ వయస్సు పిల్లలు బడిలో ఉండాలి. చదువుకోవాలి. కానీ ఏడేళ్ల వయస్సులో ఆ బాలుడు తన వంశపారంపర్యంగా వచ్చే వృత్తిని నిర్వహిస్తున్నాడు. దానికి కారణాలు ఏవైనాగానీ అది నేరం. ఈ విషయం ధర్మాసనం దృష్టికి వెళ్లటంతో దేవదాయశాఖను మద్రాసు హైకోర్టు వివరణ కోరింది.నెడుకాడు గ్రామంలో గేల్తై అమ్మన్‌ ఆలయం ఉంది. అమ్మవారు బడగ సామాజిక వర్గానికి కులదేవత. 1994 మే 25న ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి వచ్చింది. వంశపార్యంపర్యంలో భాగంగా గోపాలకృష్ణ అనే వ్యక్తి కుమారుడు రాణేష్‌ ఏడేళ్ల బాలుడిని పూజారిగా నియమించారు.

Read more : Biryani Free : 2 కేజీల బిర్యానీ కొంటే అర కిలో టమాటాలు ఫ్రీ! లేదా..కిలో టమాటాలు ఇస్తే కిలో బిర్యానీ ఫ్రీ!

ఇక్కడ పూజారిగా ఉండే వారు పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీనిపై నీలగిరి జిల్లా కొత్తగిరి గ్రామానికి చెందిన టి.శివన్‌ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఇన్‌చార్జ్‌ ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాథ్‌ బండారి, ఆదికేశవులు బెంచ్‌ మంగళవారం (నవంబర్ 23,2021)విచారణ చేపట్టింది.ఏడేళ్ల పిల్లాడిని పూజారిగా ఆ బాలుడి చదువు ఆగిపోయిందని..అతని భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిల్లాడిని 2వ తరగతివరకే చదివించారని తరువాత 2020 ఆగస్టు 16న చదవును బలవంతంగా మాన్పించేసి ఇలా గుడిలో పూజారిగా నియమనించారని కోర్టుకు తెలియజేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తులు దేవాదాయశాఖను ఆదేశించారు.

Read more : Today Gold Price : పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

కాగా..రాణేష్ చదువు ఆగిపోవటం ఇష్టం లేని ఆ స్కూల్ మాస్టారు పుస్తకాలు పెన్నులు ఇచ్చి గుడి ఆవరణలోనే చదువు చెబుతున్నారు. కాగా బడగ సామాజిక వర్గం పురాతన ఆచారం ప్రకారం… పూజారి గుడిలో ఉండగా..ఆడవారు మాట్లాడకూడదట..దీంతో మగ మాస్టారు మాత్రమే వచ్చి ఆ పిల్లాడికి చదువు చెబుతుంటారు.అలా ఆ పిల్లాడికి అతని తల్లిదండ్రులకు విద్యాశాఖకు చెందిన మగవారితో కౌన్సెలింగ్ నిర్వహించి తిరిగి బడిలో చేర్పించేలా ఉపాధ్యాయులు నవంబర్ 8న తిరిగి బడిలో చేర్పించేలా చేశారు. ఈ క్రమంలో దేవాదయ శాఖ కోర్టు ఎటువంటి వివరణ ఇంచిదో గానీ..స్తుందో..దాని పరిశీలించి విచారించిన కోర్టు మరి రాణేష్ విషయంలో ఎటువంటి తీర్పునిస్తోందో చూడాలి.