Biryani Free : 2 కేజీల బిర్యానీ కొంటే అర కిలో టమాటాలు ఫ్రీ! లేదా..కిలో టమాటాలు ఇస్తే కిలో బిర్యానీ ఫ్రీ!

2 కేజీల బిర్యానీ కొంటే.. అర కిలో టమాటాలు ఫ్రీ! లేదా, ఒక కిలో టమాటాలు ఇస్తే 1 కేజీ బిర్యానీ ఫ్రీ!’’అంటూ ప్రకటించాడు ఓ బిర్యానీ సెంటర్ యాజమాని..దీంతో జనాలు తెగ ఎగబడుతున్నారట..

Biryani Free : 2 కేజీల బిర్యానీ కొంటే అర కిలో టమాటాలు ఫ్రీ! లేదా..కిలో టమాటాలు ఇస్తే కిలో బిర్యానీ ఫ్రీ!

Tomatos High Price..biryani Free Offer

Tomatos High price..Biryani Free Offer : ఇటు పెట్రోల్ ధరలు..అటు టమాటా ధరలు రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్లుగా ఉంది. నువ్వు నేనా అన్నట్లుగా ఉన్నాయి ధరలు. లీటరు పెట్రోల్ రూ.108 అమ్ముతుంటే..కిలో టమాటా రూ.100 నుంచి రూ.150వరకు అమ్ముతోంది. ఈక్రమంలో ఓ బిర్యానీ సెంటర్ యజమాని టమాటాల కోసం ఓ వినూత్న ఆఫర్ ప్రకటించాడు. ‘‘2 కేజీల బిర్యానీ కొంటే అర కిలో టమాటాలు ఫ్రీ! లేదా, ఒక కిలో టమాటాలు ఇస్తే 1 కేజీ బిర్యానీ ఫ్రీ!’’అంటూ ప్రకటించాడు. అసలే ఆ బిర్యానీ సెంటర్ కు మంచి పేరుంది. పైగా ఈ వినూత్న ఆఫర్ తో జనాలు ఎగబడుతున్నారట. టమాలు తెచ్చినవారి బిర్యానీ ఫ్రీగా ఇస్తు..బిర్యానీ కొన్నవారికి టమాటాలు ఫ్రీగా ఇస్తు ఈ టమాటాల ధరల మోతల్ని తన వ్యాపారానికి అనుగుణంగా మార్చుకుంటున్నాడా బిర్యానీ సెంటర్ యజమాని.

Read more : Vishnu Khatri : వ్యాక్సిన్ వేయించుకుంటే ఫోన్ రీచార్జ్ చేయిస్తా : ఎమ్మెల్యే ఆఫర్

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఓ బిర్యానీ సెంటర్ వినూత్న ఆఫర్ తీసుకువచ్చింది. మధురాంతకం ప్రాపర్టీ వద్ద ఉన్న ఎల్ఆర్ అంబూర్ బిర్యానీ హోటల్ రుచిలో మంచి పేరుసంపాదించుకుంది. ఇక్కడ కిలో బిర్యానీ రూ.100లు. చెన్నైలో కిలో టమాటా రూ.150 పలుకుతోంది. ఈ క్రమంలో అంబూర్ బిర్యానీ సెంటర్ ‘‘2 కేజీల బిర్యానీ కొంటే అర కిలో టమాటాలు ఫ్రీ! లేదా, ఒక కిలో టమాటాలు ఇస్తే 1 కేజీ బిర్యానీ ఫ్రీ!’’అంటూ వినూత్న ఆఫర్ ప్రకటించింది.

Read more : Saloon Offer: వ్యాక్సిన్ తీసుకుంటే.. హెయిర్ కట్ 50% డిస్కౌంట్!

ఈ ఆఫర్ ప్రకటించిన తర్వాత అంబూర్ రెస్టారెంట్ కు జనాల రద్దీ బాగా పెరిగిపోయింది. ఓ పక్క కిలో టమాటాలు తెచ్చి కిలో బిర్యానీ తీసుకెళ్లేవాళ్లు, రెండు కేజీల బిర్యానీతో పాటు అరకేజీ టమాటాలు తీసుకెళ్లే వాళ్లతో హోటల్ కిటకటలాడుతోందట. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.