Team India : దక్షిణాఫ్రికా టూర్ వాయిదా ?

దక్షిణాఫ్రికాలో ఉన్న పరిస్థితి అంచనా వేస్తున్నట్లు, పర్యటన మాత్రం షెడ్యూల్ లోనే ఉందన్నారు.

Team India : దక్షిణాఫ్రికా టూర్ వాయిదా ?

Bcci

Team India Tour : ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయం పట్టుకుంది. పలు దేశాల్లో వైరస్ కేసులు వెలుగు చూస్తుండడంతో దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రధానంగా..విదేశాల నుంచి వచ్చే వారిపై కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో…కొద్ది రోజుల్లో టీమిండియా..దక్షిణాఫ్రికా టూర్ వెళ్లాల్సి ఉంది. కానీ..ఒమిక్రాన్ భయంతో..టూర్ ను వారం పాటు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

Read More : South Eastern Railway : సౌత్ ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటీస్ ఖాళీల భర్తీ

ఈ విషయంలో బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ…దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. దక్షిణాఫ్రికాలో ఉన్న పరిస్థితి అంచనా వేస్తున్నట్లు, పర్యటన మాత్రం షెడ్యూల్ లోనే ఉందన్నారు. టూర్ విషయంలో నిర్ణయించుకోవడానికి ఇంకా సమయం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాల్సి ఉందన్నారు. దక్షిణాఫ్రికాలోనే ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

Read More : Ghat Roads : టీటీడీ ముందుచూపు, ఘాట్ రోడ్ల మధ్య లింక్ రోడ్డు

ఇప్పటికే టీమిండియా ఏ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. కాన్పూర్ టెస్టు ముగిసిన అనంతరం..టీమిండియా సభ్యుల ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు 8 రోజుల క్వారంటైన్ లో టీమిండియా క్రీడాకారులు ఉంటారంటూ ప్రచారం జరిగింది. మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్ లు దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడనుంది.