India Vs England : చరిత్ర సృష్టిస్తారా ? భారత్ – ఇంగ్లండ్ నాలుగో టెస్టు రసవత్తరం

చరిత్ర సృష్టిస్తారా... చతికిల పడతారా.. ఇప్పుడిదే ప్రశ్న క్రికెట్ ఫ్యాన్స్‌ మదిలో మెదులుతోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది.

India Vs England : చరిత్ర సృష్టిస్తారా ? భారత్ – ఇంగ్లండ్ నాలుగో టెస్టు రసవత్తరం

Bcci

India Vs England Fourth Test : చరిత్ర సృష్టిస్తారా… చతికిల పడతారా.. ఇప్పుడిదే ప్రశ్న క్రికెట్ ఫ్యాన్స్‌ మదిలో మెదులుతోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది. రెండు జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే మన బౌలర్లు చివరి రోజు అంటే ఇవాళ పది వికెట్లు తీయాల్సిందే. ఇంగ్లండ్‌ విజయానికి మరో 240 పరుగుల దూరంలో ఉంది. టెస్టులో చివరి రోజు 250కు పైగా పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్టమే అంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు. దీంతో… నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ఎన్ని మలుపులు తిరుగుతుందో.. విజయం ఎవరివైపు మొగ్గుతుందో అనే ఆసక్తి పెరుగుతోంది.

Read More :London : సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లండ్.. విజయం సాధించాలని ఇండియా 

368 పరుగుల టార్గెట్ :-
368 పరుగల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఇంగ్లండ్ టీమ్.. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఖాతాలో మరో విజయం వేసుకొని ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలంటే నాలుగో టెస్టులో చివరి రోజు భారత బౌలర్లు సత్తా చాటాలి. అటు ఇంగ్లండ్ కూడా విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. నిన్న నాలుగో రోజు వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసిన ఇంగ్లండ్.. ఇవాళ బ్యాటింగ్ కంటిన్యూ చేస్తోంది. ఇక.. టెస్టు మ్యాచ్‌లో మూడొందల లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టమే అని రికార్డులు చెబుతున్నాయి. అది ఇంగ్లండ్ గడ్డపై ఐదో రోజు చేజింగ్ అంటే ఇంకా కష్టం. దీంతో.. నాలుగో టెస్టు ఆసక్తికర ముగింపు దిశగా సాగుతోంది.

Read More : భారత్‌ – ఇంగ్లండ్ టెస్టు : మొతెరా కాదు మోదీ
చరిత్ర సృష్టిస్తుందా ? :-
ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా… అంటే కోహ్లీ సేనకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆన్సర్ వస్తోంది. ఈ మ్యాచ్‌‌లో విజయం సాధించాలంటే టీమిండియా బౌలర్లు 10 వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గనుక భారత్ విజయం సాధిస్తే… 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది. అంతే కాకుండా.. ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకుపోతుంది. ఇక ఓవల్ గ్రౌండ్‌లో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు.  ఆ స్టేడియంలో చివరి సారిగా 1971లో టీమిండియా గెలిచింది.

Read More : Rohit Sharma: రోహిత్ తొలి విదేశీ సెంచరీ.. కోహ్లీ రియాక్షన్ చూశారా..

రావాల్సిన ఫలితం వస్తుందా ? :-
అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయం. ఆ తర్వాత 8 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్కదాంట్లో విజయం సాధించ లేదు. చివరి మూడింటిలో చిత్తుగా ఓడి.. అంతకుముందు ఐదు మ్యాచ్‌ల్లో డ్రా చేసుకుంది. అద్భుత పోరాటంతో మ్యాచ్‌లో కోహ్లీసేన పటిష్ట స్థితిలో నిలిచినా.. ఆతిథ్య జట్టు అవకాశాలనూ కొట్టిపారేసే పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు. జడేజా తప్ప, భారత జట్టులో మరో స్పిన్నర్ అందుబాటులో లేడు. రోహిత్ శర్మ స్పిన్ బౌలింగ్ వేయగలిగినా.. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా అతనితో బౌలింగ్ వేయించింది లేదు. దీంతో బ్యాటింగ్‌లో అదరగొట్టి, ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచినా… రావాల్సిన ఫలితం వస్తుందా.. లేదా.. అనే అనుమానం నెలకొంటోంది.