Tecno Spark 10C : 5,000mAh బ్యాటరీతో టెక్నో Spark 10C ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
Tecno Spark 10C Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? టెక్నో మొబైల్ (Techo Mobile) నుంచి సరికొత్త (Sparck 10C) ఫోన్ వచ్చేసింది. 5,000mAh బ్యాటరీతో పాటు డ్యూయల్ రియల్ కెమెరాలను కలిగి ఉంది. ఇంతకీ ధర ఎంతంటే?

Tecno Spark 10C Launch (Photo Credit : Tecno Mobile)
Tecno Spark 10C Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు టెక్నో (Tecno) నుంచి Spark 10C కొత్త ఫోన్ వచ్చేసింది. టెక్నో కంపెనీ స్పార్క్ 10 లైనప్‌లో లేటెస్ట్ మోడల్‌గా ఆఫ్రికాలో లాంచ్ అయింది. ఈ లేటెస్ట్ (Tecno Mobile) హ్యాండ్సెట్ మూడు విభిన్న కలర్ ఆప్షన్లలో వస్తుంది.
16-MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. టెక్నో Spark 10C ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లేను కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM, మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీ యూజర్లు 8GB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు. తద్వారా RAM 16GB వరకు పొడిగించుకోవచ్చు.
టెక్నో Spark 10C ధర ఎంతంటే? :
ఈ ఫోన్ బేస్ 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ (Tecno Spark 10C) ధర GHS 1,290 (దాదాపు రూ. 9,800)గా నిర్ణయించింది. 8GB RAM + 128GB స్టోరేజీతో టాప్-ఎండ్ వేరియంట్ ధర GHS 1,555 (దాదాపు రూ. 12వేలు)గా ఉంది. ఈ ఫోన్ మెటా బ్లాక్, మెటా బ్లూ, మెటా గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. టెక్నో Spark 10C భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. టెక్నో ఇటీవల భారత మార్కెట్లో Spark 10 Pro లాంచ్ చేసింది. 16GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 12,499గా ఉండనుంది.

Tecno Spark 10C Launch (Photo Credit : Tecno Mobile)
టెక్నో స్పార్క్ 10C స్పెసిఫికేషన్స్ ఇవే :
టెక్నో Spark 10C ఫోన్ Android 12-ఆధారిత HiOS 8.6పై రన్ అవుతుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల HD+ (720×1612 పిక్సెల్‌లు) డిస్ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరాతో డిస్ప్లే వాటర్‌డ్రాప్-శైలి కటౌట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ SoC ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 8GB RAM అందిస్తుంది. మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో ఇన్‌బిల్ట్ స్టోరేజీని అందిస్తుంది.
ఇందులో ర్యామ్‌ను 16GB వరకు విస్తరించవచ్చు. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. టెక్నో Spark 10C 16-MP ప్రధాన సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ ఫ్లాష్‌తో కూడిన 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రానుంది. ఈ ఫోన్ వేరియంట్ 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందిస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, 4G, GNSS, బ్లూటూత్, GPS, FM రేడియో, ఛార్జింగ్ USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, E-కంపాస్, G-సెన్సార్, గైరోస్కోప్ వంటి సెన్సార్లు ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. టెక్నో Spark 10Cలో 163.84×75.49×8.50mm కొలతలు, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.
Read Also : Samsung Galaxy Z Fold 5 : శాంసంగ్ నుంచి రెండు కొత్త మడతబెట్టే ఫోన్లు.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!