CM KCR: తగ్గేదే లే.. కేంద్రంతో కొట్లాటే.. రేపే ఇందిరా పార్క్‌ దగ్గర ధర్నా!

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం మొదలెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.

CM KCR: తగ్గేదే లే.. కేంద్రంతో కొట్లాటే.. రేపే ఇందిరా పార్క్‌ దగ్గర ధర్నా!

Cm Kcr

CM KCR: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం మొదలెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ.. రేపు(18 నవంబర్ 2021) హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు సీఎం ప్రకటించారు.

కేంద్రంలోని బీజేపీ సర్కారు ద్వంద్వ వైఖరి, రాష్ట్ర బీజేపీ నేతల తీరును ఎండగడుతూ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వకుంటే అన్ని వేదికలపైనా పోరాటం చేస్తామన్నారు. యాసంగిలో వరి వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉన్నారో లేదో చెప్పాలన్నారు. తప్పుగా చెప్పి ఉంటే ముక్కు నేలకు రాసి, రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు సీఎం కేసీఆర్‌.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురస్కారం

రేపు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇందిరాపార్కు దగ్గర ధర్నా కొనసాగుతుందని కేసీఆర్‌ చెప్పారు. మొత్తం రాష్ట్ర కేబినెట్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, సహకార బ్యాంక్‌ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు ఈ ధర్నాలో పాల్గొంటారని చెప్పారు. ధర్నా అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కి వినతిపత్రం ఇస్తామన్నారు.

Kuppam: కుప్పం కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. ప్రత్యేక అధికారిని నియమించిన హైకోర్టు

అలాగే ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర విధానాన్ని స్పష్టం చేయాలని కోరుతూ ఇవాళ ప్రధానికి, కేంద్ర ఆహారశాఖమంత్రికి లేఖ రాస్తానన్నారు సీఎం కేసీఆర్‌. ఏడాదికి ఎఫ్‌సీఐ తీసుకొనే ధాన్యం టార్గెట్‌ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామని తెలిపారు.