T.congress protest : వరిధాన్యం కొనాలంటూ పోరు..కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు..

తెలంగాణలో వరి ధాన్యం మంటలు పుట్టిస్తోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య వరి ధాన్యం కొనుగోలు విషయంలో మాటల యుద్ధం పుట్టిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ వరిధాన్యం కొనాలంటూ నిరసన చేపట్టింది.

T.congress protest :  వరిధాన్యం కొనాలంటూ పోరు..కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు..

Telangana Congress Protest Today With The Demand For Paddy Grain Purchase

Telangana congress protest demand for paddy grain purchase : తెలంగాణలో వరి ధాన్యం మంటలు పుట్టిస్తోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య వరి ధాన్యం కొనుగోలు విషయంలో మాటల యుద్ధం పుట్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య వరి సెగలు రేకెత్తిస్తోంది. కేంద్రం ధాన్యం కొనాలంటే తెలంగాణ అధికార పార్టీ బీజేపీని డిమాండ్ చేస్తుంటే..బీజేపీ మాత్రం తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అటు కేంద్ర ప్రభుత్వంపైనా..ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు సంధిస్తోంది. దీంట్లో భాగంగా..వరి ధాన్యం కొనుగోలు చేయాలి అంటూ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోరుబాట పట్టాయి.

ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్లగొండ, వరంగల్ యాత్రలు రసాభాసాగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణలో మెల్లగా పుంజుకుంటున్న బీజేపీ టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతోంది. ఈక్రమంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ప్రభుత్వానిదే తప్పు అని టీఆర్ఎస్ అంటుంటే కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకానితనం వల్లనే రైతులు నష్టపోతున్నారంటోండి బీజేపీ. ఇది కాస్త బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఓ చిన్న పాటి యుద్ధంగా కొనసాగుతోంది. మాటలతో యుద్ధాలు చేసుకుంటున్నారు.

అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా వరిధాన్యంపై పోరుకు సిద్ధం అయింది. ఇన్ని రోజులు బీజేపీని ఎదుర్కున్న టీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. గురువారం (నవంబర్ 18,2021) రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించాలన్న డిమాండ్‌తో గురువారం పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి వ్యవసాయశాఖ కమిషనరేట్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీ నిరసన ప్రదర్శనను నిర్వహించనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన ప్రదర్శనలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొననున్నారు. వ్యవసాయశాఖ కమిషనరేట్‌ వరకు ప్రదర్శన అనంతరం రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలంటూ వినతిపత్రం సమర్పించనున్నారు.