Telangana : స్టార్ హోటల్స్ లో గదులు సిద్ధం చేసిన..కార్పొరేట్ ఆసుపత్రులు..పూర్తి వివరాలు

Telangana : స్టార్ హోటల్స్ లో గదులు సిద్ధం చేసిన..కార్పొరేట్ ఆసుపత్రులు..పూర్తి వివరాలు

Star Hotels

Corporate Hospitals : కరోనా సమయంలో తెలంగాణాలో కార్పొరేట్ ఆసుపత్రులు రూటు మార్చాయి. కరోనా పేషెంట్ల తాకిడిని తట్టుకొనేందుకు..స్టార్ హోటల్స్ ను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేశాయి. కోవిడ్ బాధితులకు ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు వందల రూమ్స్ ను బుక్ చేశాయి. దాదాపు 12 వందల బెడ్స్ ఏర్పాటు చేసి..వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్నాయి.

కరోనా పాజిటివ్ రాగానే జనం వణికిపోతున్నారు. అవసరం ఉన్నా..లేకపోయినా..ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో బెడ్స్ అన్నీ నిండిపోతున్నాయి. అయితే..ఆరోగ్యం విషమంగా ఉన్న వారికి చోటు దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ట్రీట్ మెంట్ అందిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులు కొత్త దారిని ఎంచుకున్నాయి.

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో హోటల్స్ లను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చి..రోగులకు చికిత్స అందించాయి. దీంతో ఉన్నతవర్గాలకు చెందిన వారు వీటిని ఆశ్రయించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో జనాల్లో భయం ఎక్కువైంది. చిన్నపాటి లక్షణాలకే డాక్టర్ల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. కుటుంబాలకు దూరంగా ఉండేందుకు..ప్రైవేటు ఆసుపత్రులు హోటల్స్ లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోతుండడంతో టాప్ స్టార్ హోటల్స్ అన్నీ స్పెషల్ రూమ్స్ లను అందుబాటులోకి తెచ్చాయి. దాదాపు 1225 బెడ్స్ ఏర్పాటు చేశాయి.

–  అపోలో ఆసుపత్రి యాజమాన్యం..ఆదిత్య, తాజ్ బంజారా, గ్రీన్ పార్క్ హోటల్స్ లలో 250 గదులను రెడీ చేసింది.
–  యశోద ఆసుపత్రి 130 గదులు సిద్ధం చేసింది. గ్రీన్ పార్క్, బెస్ట్ వెస్ట్రన్, అశోక్ హోటల్స్ లో ఐసోలేషన్ రూమ్స్ లను ఏర్పాటు చేసింది.
–  ఓమ్నీ ఆసుపత్రి 122 రూమ్స్ లను బుక్ చేసుకుంది.

–  ఆదిత్య పార్క్ హోటల్స్ లో విన్ ఆసుపత్రి యాజమాన్యం 82 బెడ్స్ కేటాయించింది.
–  ద గొల్కోండ హోటల్స్ లో సిటీ న్యూరో ఆసుపత్రి 50 గదులను సిద్ధం చేసింది.
–  టీఎక్స్ హాస్పిటల్ కాచిగూడ టూరిస్టు ప్లాజాలో 30 రూమ్స్, లెమట్రీ హోటల్ లో మహవీర్ ఆసుపత్రి 67 గదులను కేటాయించింది.

–  హోటల్ మారియట్ లో కాంటినెంటల్ ఆసుపత్రి యాజమాన్యం 100 గదులను సిద్ధం చేసింది.
–  మనోహర్ హోటల్ లో కిమ్స్ ఆసుపత్రి 50 రూమ్స్ వినియోగిస్తోంది.
–  కేర్ ఆసుపత్రి యాజమాన్యం..కంఫోర్టల్ హోటల్ లో 52 రూమ్స్ అరెంజ్ చేశారు.

ఇలా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ..స్టార్ హోటల్స్ లో కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందిస్తున్నాయి. 14 రోజుల క్వారంటైన్ పూర్తయ్యే వరకు క్షేమంగా చూసుకుంటున్నాయి.

Read More : India Covid : ఆగస్టు నాటికి 10 లక్షల మరణాలు, కరోనా నియంత్రణకు చర్యలు ఎక్కడ ? లాన్సెట్ ఘాటు వ్యాఖ్యలు