Dalit Bandhu : హుజూరాబాద్‌ లో దళితబంధుకు మరో రూ.300 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం హుజూరాబాద్‌ లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం మరో రూ.300 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కరీంనగర్‌ కలెక్టర్ ఖాతాకు రూ.300 కోట్లు బదిలీ చేసింది.

Dalit Bandhu : హుజూరాబాద్‌ లో దళితబంధుకు మరో రూ.300 కోట్లు

Dalit Bandhu (1)

Telangana Government Dalit bandhu : తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకం కోసం మరో రూ.300 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకం పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతోంది. హుజూరాబాద్‌లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఖాతాకు రూ.300 కోట్లను బదిలీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా రూ.1,200 కోట్లు విడుదల చేసింది.

తాజాగా విడుదల చేసిన రూ.300 కోట్లతో కలిపి మొత్తం రూ.1,500 కోట్లు విడుదల అయ్యాయి. త్వరలో మరో రూ.500 కోట్లను కరీంనగర్‌ కలెక్టర్‌ ఖాతాకు బదిలీ చేయనుంది. మొత్తం రూ.2000 కోట్లతో నియోజకవర్గంలోని దళితులందరికీ ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంతో పైలట్‌ ప్రాజెక్టుగా స్టార్ట్ అయ్యింది. దళిత బంధు పేరుతో సూచనాత్మక ఆర్థికాభివృద్ధి పథకాల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన దళితులను యజమానులను చేయడమే లక్ష్యంగా మహిళల పేరు మీద నగదును జమ చేసేందుకు ప్లాన్ చేస్తుంది.