Telangana Govt : కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని.. కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

ఈ అంశాన్ని కేఆర్ఎంబీ మినిట్స్ లోనూ పొందుపరిచారని, అయితే కేంద్రానికి పంపినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని లేఖలో తెలిపారు.

Telangana Govt : కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని.. కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

KRMB

Telangana govt letter KRMB : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేల్చే అంశంపై వీలైనంత త్వరగా కేంద్ర జలశక్తిశాఖకు నివేదించాలని కోరింది. ఈ మేరకు గురువారం బోర్డు చైర్మన్ నీటి పారుదలశాఖ ఈఎన్ సీ మురళీధర్ లేఖలో విజ్ఞప్తి చేశారు. అలాగే మే 10న జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నీటి వాటా అంశాన్ని జలశక్తిశాఖకు నివేదించాలని కోరారు.

ఈ అంశాన్ని కేఆర్ఎంబీ మినిట్స్ లోనూ పొందుపరిచారని, అయితే కేంద్రానికి పంపినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని లేఖలో తెలిపారు. కృష్ణా నదిపై ఇరు రాష్ట్రాలకు చాలా ప్రాజెక్టులు ఉన్నాయని, నీటి వాటా నిష్పత్తి తేలకుండా వాటికి జలాలను తరలించడం సాధ్యం కాదన్నారు. కొత్త నీటి సంవత్సరం సైతం ప్రారంభమైందని, వీలైనంత త్వరగా ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని వెల్లడించారు.

Minister Harish Rao : గోదావరి నీళ్లను మంజీరాకు మళ్లించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది : మంత్రి హరీశ్ రావు

నిర్ణయం వచ్చే వరకు 50:50 నిష్పత్తిగా భావించి ఆ ప్రాతిపదికనే ఇండెంట్ ఇస్తామని వెల్లడించారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు 2022-23లో అధిక నీటి వినియోగానికి సంబంధించిన అంశాన్ని సైతం కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని కృష్ణా బోర్డును కోరిందన్నారు. అయితే, ఎన్ని లేఖలు రాసినా బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు.