Telangana : విద్యా సంస్థల్లో ఆన్‌‌లైన్ బోధన కొనసాగించాలి.. కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ..తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది హైకోర్టు.

Telangana : విద్యా సంస్థల్లో ఆన్‌‌లైన్ బోధన కొనసాగించాలి.. కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

High Court

Telangana High Court : తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు జారీ చేసింది. విద్యా సంస్థల్లో ఆన్ లైన్ బోధన కొనసాగించాలని, 20వ తేదీ వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు..ఆన్ లైన్ బోధన ఉండే విధంగా చూడాలని సూచించింది. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ధ కోవిడ్ నిబంధనలు అయలయ్యేలా చూడాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రశ్నించింది. త్వరలో జరగబోయే సమ్మక్క జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని వెల్లడించింది. ప్రస్తుతం ముచ్చింతల్ లో జరుగుతున్న సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కూడా నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి తెలిపింది. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ..తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది హైకోర్టు.

Read More : Tirupati IIT : తిరుపతి ఐఐటిలో ఖాళీల భర్తీ

మరోవైపు… 02వ తేదీ బుధవారం ఒక్క రోజు తెలంగాణ రాష్ట్రంలో 2 వేల 646 మంది వైరస్ సోకింది. ముగ్గురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఒక్క రోజులో 3 వేల 603 మంది కోలుకున్నారని, రికవరీ రేటు 94.96 శాతంగా ఉందని తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 747 కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో 60, భద్రాద్రి కొత్తగూడెంలో 71, జగిత్యాల్ లో 41, జనగాంలో 43, జయశంకర్ భూపాలపల్లిలో 35, జోగులాంబ గద్వాల్ లో 15, కామారెడ్డి 44, కరీంనగర్ లో 102, ఖమ్మం 81, కొమరం భీం ఆసిఫాబాద్ 16, మహబూబ్ నగర్ లో 78, మహబూబాబాద్ 48, మంచిర్యాలలో 55, మెదక్ లో 58, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 177, ములుగు లో 23, నాగర్ కర్నూలులో 26, నల్గొండలో 86, నారాయణపేట లో 20, నిర్మల్ లో 19, నిజామాబాద్ లో 58, పెద్దపల్లిలో 51, రాజన్న సిరిసిల్లలో 38, రంగారెడ్డిలో 134, సంగారెడ్డిలో 74, సిద్ధిపేటలో 87, సూర్యాపేటలో 69, వికారాబాద్ లో 44, వనపర్తిలో 40, వరంగల్ రూరల్ లో 32, హన్మకొండలో 114, యాదాద్రి భువనగిరిలో 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.