Telangana Inter Results : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రేపే

తెలంగాణ ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.

Telangana Inter Results : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రేపే

Telangana Inter First Year Results Tomorrow

Telangana Inter First Year results tomorrow : పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు తెలంగాణ ఇంటర్ విద్యార్ధులు. వారి ఎదురు చూపులు రేపే ఫలించనున్నాయి. తెలంగాణ ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను బుధవారం (డిసెంబర్ 15,2021)న విడుదల కానున్నాయి. కరోనా వైరస్ కారణంగా గత సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలను ఇటీవల నిర్వహించింది ఇంటర్ బోర్డు. ఈ పరీక్షా ఫలితాలను ఇంటర్ బోర్డు రేపు విడుదల చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

Read more : Covid Vaccine : 24 గంటల్లో 10 సార్లు కొవిడ్‌ వ్యాక్సిన్లు వేయించుకున్న వ్యక్తి..నిర్దారించిన ఆరోగ్యశాఖ

థియరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయినప్పటికీ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో డిసెంబర్ 3 నుంచి 7 వరకు ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు.

Read more : Indian Railways: ఇండియన్ రైల్వేస్‌లో వృద్ధుల టిక్కెట్లపై రాయితీ కట్

కాగా మరోవైపు వచ్చే ఏడాది ఇంటర్‌ వార్షిక పరీక్షలను ఏప్రిల్‌ నెలలో నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం 2022 మార్చి 23 నుంచి ఇంటర్‌ పరీక్షలు జరగాలి. అయితే ఈ ఏడాది కూడా కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతుల ప్రారంభం ఆలస్యమైంది. దీంతో ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించాని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.