Telangana : మంత్రి కేటీఆర్ కారుకు చలాన్, ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్‌కు సన్మానం

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కారుకు చలాన్ వేసిన ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్ కు సన్మానం చేశారు. వీరిద్దరినీ తన కార్యలయానికి పిలిపించుకుని...మరీ అభినందించారు.

Telangana : మంత్రి కేటీఆర్ కారుకు చలాన్, ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్‌కు సన్మానం

Ktr Chalan

Telangana Minister KTR  : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కారుకు చలాన్ వేసిన ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్ కు సన్మానం చేశారు. సన్మానం చేసింది ఎవరో కాదు..స్వయంగా మంత్రి కేటీఆర్. వీరిద్దరినీ తన కార్యలయానికి పిలిపించుకుని…మరీ అభినందించారు. సామాన్య ప్రజలు, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. చలాన్ విధించిన రోజు తాను వాహనంలో లేనని తెలిపారు. మంత్రి కేటీఆర్ తన వాహనానికి విధించిన చలాన్ సైతం చెల్లించారు. ఈ విషయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు సరైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

Read More : CM Jagan : ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్ ఉండాలి

2021, అక్టోబర్ 02వ తేదీ మహాత్మాగాంధీ జయంతి రోజు సందర్భంగా..లంగర్ హౌస్ సమీపంలో బాపూఘాట్ లో కార్యక్రమం నిర్వహించారు. అనుకోని పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్ వాహనం రాంగ్ రూట్ లో వచ్చింది. ఈ సమయంలో..అక్కడనే ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆ వాహనాన్ని ఆపి…చలాన్ విధించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో…వారిద్దరినీ 2021, అక్టోబర్ 04వ తేదీ సోమవారం తన కార్యాలయానికి పిలిపించుకున్నా మంత్రి కేటీఆర్. వారిద్దిరికీ బోకెలు ఇచ్చి..శాలువాతో సత్కరించారు. ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని, విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకు ఎప్పుడూ తాము అండగా ఉంటామని హామీనిచ్చారు.