CM Jagan : ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్ ఉండాలి

రాష్ట్రంలో శాంతిభద్రతలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ''దిశ చట్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎ

CM Jagan : ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్ ఉండాలి

Cm Jagan

CM Jagan : రాష్ట్రంలో శాంతిభద్రతలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ”దిశ చట్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ప్రతి మహిళ ఫోన్ లో దిశ యాప్ ఉండాలి. ఇందుకోసం వాలంటీర్లు, మహిళా పోలీసుల సాయం తీసుకోవాలి. దిశ యాప్ పై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి” అని సీఎం జగన్ అన్నారు.

Covid Victims : మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే..కోవిడ్‌‌తో చనిపోయిన ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదు

దిశ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాలను అరికట్టడం వంటి అంశాలపైనా సీఎం జగన్ అధికారులతో చర్చించారు. కాలేజీలు‌, యూనివర్సిటీలపైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సీఎం జగన్ సూచించారు. మిషన్ డ్రగ్‌ ఫ్రీ స్టేట్‌ కోసం అందరూ పని చేయాలని చెప్పారు. సైబర్‌ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణకు జగన్ ఆదేశించారు.

Flubot Malware : సెక్యూరిటీ అప్‌డేట్ అని మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే

ఇప్పటివరకూ 74,13,562 మంది ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్స్‌ చేశారని పోలీసు అధికారులు సీఎంకు తెలిపారు. దిశ యాప్‌ ద్వారా 5వేల 238 మందికి సాయం అందించినట్లు వివరించారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్‌ చేసినట్లు తెలిపారు.

మహిళా భద్రత కోసం జగన్ ప్రభుత్వం దిశ మొబైల్‌ యాప్‌ తెచ్చింది. విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ యాప్ ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం వివరించింది. ఏదైనా ఆపదలో ఉన్నా, ప్రమాదం కలగనుందనే అనుమానం వచ్చినా వెంటనే దిశ యాప్‌లోని రెడ్‌ బటన్‌ ప్రెస్‌ చేస్తే వెంటనే పోలీసులకు ఇతర అధికారులకు సమాచారం అందుతుందని, నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి, మహిళ, ఉద్యోగిని దిశ యాప్‌ను వినియోగించి రక్షణ పొందాలని ప్రభుత్వం కోరింది.

రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్‌ ఉండే ప్రతి మహిళ దగ్గర దిశ యాప్ ఉండాలని సీఎం జగన్‌ చెప్పారు. ఫోన్‌లో దిశ యాప్‌ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టేనని.. ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టాన్ని కూడా అమలు చేస్తున్నామని సీఎం జగన్ గతంలో తెలిపారు.