Heatwave Alert: మరో రెండు రోజులు.. తెలంగాణలో భానుడి భగభగలు.. 11 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ..

మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 11 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Heatwave Alert: మరో రెండు రోజులు.. తెలంగాణలో భానుడి భగభగలు.. 11 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ..

Heatwave Alert

Updated On : June 19, 2023 / 5:57 PM IST

Heatwave Alert: వేసవి కాలం (summer season) వచ్చేసింది. ఏప్రిల్ మొదటి వారం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఏకంగా 44 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు వేడి గాలులు (hot winds) , ఉక్కపోత తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు సాయంత్రం వేళ ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

West Bengal : ఎండ వేడితో ఆమ్లెట్, పాప్ కార్న్ వండేస్తున్న వెస్ట్ బెంగాల్ జనం.. ఎండలు మామూలుగా లేవుగా..

రెండు రోజులు భానుడి భగభగలు..

తెలంగాణలో భానుడి భగ్గుమంటున్నాడు. గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం 11 జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. బుధ, గురువారాల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. సుమారు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 21వ తేదీ తరువాత మూడు రోజులపాటు కొంత ఉపశమనం లభిస్తుందని, ఆ తరువాత మళ్లీ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మరణించారు.

Summer Heat : వేసవి కాలంలో ఏ సమయంలో బయటకు వెళ్ళకూడదు ? ఎవరికి ప్రమాద ముప్పు ఎక్కువ

జిల్లాల వారిగా ఉష్ణోగ్రతలు..

మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 11 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జగిత్యాల జిల్లాలో 44.8, హనుమకొండ జిల్లాలో 44.7, అదిలాబాద్ జిల్లాలో 44.4, మంచిర్యాల జిల్లాలో 44.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 44.2, నల్గొండ జిల్లాలో 44.1, వనపర్తి జిల్లాలో 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.