Telangana Corona Cases : తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే..

గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,098 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,76,313కి చేరింది.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే..

Telangana Corona Cases

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. క్రమంగా కొత్త కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,098 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,76,313కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,099కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా బారి నుంచి 3వేల 801 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29వేల 226 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 629 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 74వేల 083 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. శుక్రవారంతో(2,387) పోలిస్తే కొత్త కేసులు కాస్త తగ్గాయి.

Mukesh Ambani: భారత్ లోనే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ

అటు ఏపీలోనూ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 3వేల 396 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 9మంది కోవిడ్ తో చనిపోయారు. అనంతపురం, నెల్లూరు, ప్రకాశంలో ఇద్దరు చొప్పున… చిత్తూరు, గుంటూరు, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఒక్కరోజే 13,005 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 78వేల 746 కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 29వేల 838 కరోనా టెస్టులు చేసినట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,00,765. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,07,364. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 655కి పెరిగింది. శుక్రవారం 4వేల 198 కరోనా కేసులు నమోదవగా.. శనివారం ఆ సంఖ్య తగ్గింది.

ఇక దేశవ్యాప్తంగానూ క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న‌ దేశంలో 1,27,952 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, క‌రోనా నుంచి 2,30,814 మంది కోలుకున్నార‌ని వివరించింది.

Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు

క‌రోనా కార‌ణంగా నిన్న 1,059 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం 13,31,648 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 5,01,114కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతం పెరిగింది. వినియోగించిన‌ క‌రోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 1,68,98,17,199కు చేరింది.