మొబైల్ యూజర్లకు షాక్.. భారీగా పెరగనునన్న డేటా, ఫోన్ కాల్స్ ధరలు..?

మొబైల్ యూజర్లకు షాక్.. భారీగా పెరగనునన్న డేటా, ఫోన్ కాల్స్ ధరలు..?

Telcos may hike tariffs: ఇది మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. టెలికామ్ కంపెనీలు మరోసారి టారిఫ్ ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయట. దీంతో రానున్న రోజుల్లో ఫోన్ కాల్స్, డేటా ధరలు భారీగా పెరగనున్నాయని సమాచారం.

జియో రాకతో టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరిగింది. కస్టమర్లను నిలుపుకునేందుకు టెలికామ్ కంపెనీలు టారిఫ్ ధరలు భారీగా తగ్గించాయి. దాదాపు అన్ని కంపెనీలు ఇటు డేటాతో పాటు వాయిస్ కాల్స్‌ ధరలు తగ్గించాయి. అయితే ఏప్రిల్ 1 నుంచి టెలికామ్ కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) ప్రకారం.. దాదాపు అన్ని టెలికామ్ కంపెనీలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అంతేకాదు టెలికామ్ కంపెనీలు 5జీలోకి అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయని, ఈ ఏర్పాటుకు కావాల్సిన నిధులను సేకరించే క్రమంలోనే ధరలను పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ధర ఎంతమేర పెరగనుందనే విషయం మాత్రం ఇంకా అధికారింగా తెలియరాలేదు.

టారిఫ్ పెంచడం, వినియోగదారులు 2జీ నుంచి 4జీకి మారడం ద్వారా రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని ఐసీఆర్ఏ అభిప్రాయపడింది. దీని వల్ల టెలికామ్ కంపెనీల ఆదాయం రానున్న రెండేళ్లలో 11 నుంచి 13 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. చివరిగా 2019 డిసెంబర్‌లో టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచాయి.

అతిపెద్ద మూడు టెలికామ్ కంపెనీస్ లో ఒకటైన వొడాఫోన్ ఐడియా అందరికన్నా ముందుగా వాయిస్, డేటా ప్లాన్ల ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా అప్పుల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో కోలుకోవాలంటే టారిఫ్ ను పెండచం తప్ప మరో మార్గం లేదు.