Telugu Film Producer Council Elections : నిర్మాతల మండలి ఎన్నికల పోలింగ్.. దిల్ రాజు వర్సెస్ సి. కళ్యాణ్.. కొనసాగుతున్న వివాదం..

నేడు ఫిబ్రవరి 19న తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఫిలిం ప్రొడ్యూసర్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అధ్యక్ష బరిలో నిర్మాతలు దామోదర ప్రసాద్, జెమిని కిరణ్ ఉన్నారు. ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా నాలుగేళ్లు పనిచేసిన దామోదర ప్రసాద్ కు దిల్ రాజ్ తన మద్దతు ప్రకటించడంతో..............

Telugu Film Producer Council Elections : నిర్మాతల మండలి ఎన్నికల పోలింగ్.. దిల్ రాజు వర్సెస్ సి. కళ్యాణ్.. కొనసాగుతున్న వివాదం..

Telugu Film Producer Council Elections happening dil raju vs c Kalyan

Telugu Film Producer Council Elections :  ఇటీవల సినీ పరిశ్రమలో ఏ ఎలక్షన్స్ జరిగినా అవి వివాదాలకు కారణమవుతున్నాయి. కొన్ని నెలల క్రితం మా ఎలక్షన్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇక గత కొన్ని రోజులుగా నిర్మాతల మండలి ఎన్నికల కోసం రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిన్న చిన్న సంఘాలు ఎన్ని వచ్చినా తెలుగు నిర్మాతలకు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ గా ఒకే సంఘం ఉంది. దీంట్లో దాదాపు 1200 మంది సభ్యులు ఉన్నారు. కరోనా సమయంలో యాక్టివ్ గా ఉన్న కొంతమంది అగ్ర నిర్మాతలు ప్రొడ్యూసర్ గిల్డ్ అనే ఓ అసోసియేషన్ ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అప్పటినుంచి నిర్మాతల మండలిలో వివాదాలు మొదలయ్యాయి.

నిర్మాతల మండలికి సాధారణంగా ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఎన్నికలు నిర్వహించేవారు కానీ కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కొన్ని రోజుల క్రితం చిన్న నిర్మాతలు ఎలక్షన్స్ నిర్వహించాలని ధర్నాకి కూడా దిగారు. ఆ సమయంలో నిర్మాతల మండలిలో వివాదాలు చెలరేగాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేశారు. ఎట్టకేలకు నిర్మాత సి కళ్యాణ్ ఎలక్షన్స్ ని ప్రకటించారు. ఈ ఎలక్షన్స్ లో రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. దిల్ రాజు వర్గంతో పాటు సి కళ్యాణ్ వర్గం నిర్మాతల మండలి ఎలక్షన్స్ లో పోటీ పడుతున్నాయి.

నేడు ఫిబ్రవరి 19న తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఫిలిం ప్రొడ్యూసర్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అధ్యక్ష బరిలో నిర్మాతలు దామోదర ప్రసాద్, జెమిని కిరణ్ ఉన్నారు. ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా నాలుగేళ్లు పనిచేసిన దామోదర ప్రసాద్ కు దిల్ రాజ్ తన మద్దతు ప్రకటించడంతో గిల్డ్ లో ఉన్న అగ్ర నిర్మాతలంతా దామోదర ప్రసాద్ కి మద్దతు ప్రకటించారు. ఇక జెమిని కిరణ్ కి నిర్మాత సి కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్ ప్యానల్ పేరుతో దామోదర ప్రసాద్, ఆయన టీం బరిలో నిలిచారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానల్ పేరుతో జెమిని కిరణ్, ఆయన టీం పోటీ చేస్తున్నారు. ఒక ట్రెజరర్ పోస్ట్ కి మాత్రం తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్, సెక్రటరీ పోస్టులతో పాటు, కమిటీ మెంబర్స్ పోస్టులకు రెండు వర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.

Tarakaratna : నాలుగు రోజుల్లో తారకరత్న పుట్టిన రోజు.. కానీ అంతలోనే ఇలా..

ప్రస్తుతం పోలింగ్ జరుగుతుండగా పోలింగ్ అయిన తర్వాత నేడు సాయంత్రమే రిజల్ట్స్ తెలపనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు స్టార్ నిర్మాతలతో పాటు నిర్మాతల మండలిలో ఉన్న అనేకమంది సభ్యులు వస్తున్నారు. నిన్నటి వరకు కూడా ఒక వర్గంపై మరొక వర్గం విమర్శలు చేస్తూనే ఉంది. ప్రొడ్యూసర్ గిల్డ్ ఎందుకు పెట్టారు అంటూ అగ్ర నిర్మాతలని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో యాక్టీవ్ గా లేని నిర్మాతలు చాలా మంది ఉన్నారు, వారి వల్ల ఒరిగేదేమి లేదంటూ దిల్ రాజు కూడా విమర్శలు చేశారు. మరి ఈ ఎలక్షన్స్ లో ఎవరు నెగ్గి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ని చేజిక్కించుకుంటారో చూడాలి.