Temple: మంగళూరు మసీదులో గుడి.. ఉద్రిక్తత

మసీదు లోపల దేవాలయం లాంటి నిర్మాణం ఉందనే ప్రచారం జరగడంతో కర్ణాటకలోని మంగళూరులో వివాదం మొదలైంది. స్థానిక బజ్పే పోలీస్ స్టేషన్ పరిధిలోని, మలాలిలో గత నెల 21న ఒక పాత మసీదు కూల్చివేతల సమయంలో, మసీదు లోపల దేవాలయం వంటి నిర్మాణాన్ని గుర్తించారు.

Temple: మంగళూరు మసీదులో గుడి.. ఉద్రిక్తత

Temple

Temple: మసీదు లోపల దేవాలయం లాంటి నిర్మాణం ఉందనే ప్రచారం జరగడంతో కర్ణాటకలోని మంగళూరులో వివాదం మొదలైంది. స్థానిక బజ్పే పోలీస్ స్టేషన్ పరిధిలోని, మలాలిలో గత నెల 21న ఒక పాత మసీదు కూల్చివేతల సమయంలో, మసీదు లోపల దేవాలయం వంటి నిర్మాణాన్ని గుర్తించారు.

Congress: ఐదు నెలల్లో కాంగ్రెస్‌ను వీడిన ఐదుగురు నేతలు

ఈ విషయం బయటకు రావడంతో, అక్కడ హిందూ సంఘాలు పూజలు నిర్వహించుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో వివాదం చెలరేగింది. ఇక్కడ మసీదు ఉన్న ప్రాంతం ఒకప్పుడు దేవాలయమని, అందుకే అక్కడ పూజలు నిర్వహిస్తామని వీహెచ్‌పీ చెప్పింది. అంతేకాదు… ఈ మసీదు పరిధిలో పూజలు కూడా ప్రారంభించింది. స్థానిక శ్రీ రామాంజనేయ భజన మందిర్ వద్ద ‘తాంబూల ప్రశ్న’ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించింది. దీంతో ఇరువర్గాలకు మధ్య ఉద్రిక్తత చెలరేగింది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో, పోలీసులు 144 సెక్షన్ విధించారు. మసీదు ఉన్న ప్రాంతానికి 500 మీటర్ల వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుంది. మరోవైపు ఇక్కడ ఉన్న దేవాలయం విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని హిందూ సంఘాలు అంటున్నాయి.

Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

మంగ‌ళూరులో ప్రస్తుతం వివాదానికి కారణమైన పాత మసీదును చాలా ఏళ్ల క్రితం క‌ట్టారు. ఇది పాత మసీదు కావడంతో దీన్ని పునురుద్ధరించే పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొంత భాగాన్ని కూల్చివేశారు. అప్పుడు ఇక్కడ దేవాలయం వంటి నిర్మాణాన్ని గుర్తించారు. ఈ విషయం బయటకు రావడంతో, వీహెచ్‌పీతోపాటు అనేక హిందూ సంఘాలు స్పందించాయి. ఇక్కడ పూజలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో వివాదం మొదలైంది.