Holi : రంగుల పండుగకు నగరం సిద్ధం.. జాగ్రత్తలు తీసుకోండి

హోలీ కలర్ ఫుల్ గా నిర్వహించుకొనేందుకు నగర ప్రజలు రెడీ అయిపోతున్నారు. వందలాది నడుమ నిర్వహించే రెయిన్ డ్యాన్స్ లు, పలు వేడుకలు నిర్వహించేందుకు

Holi : రంగుల పండుగకు నగరం సిద్ధం.. జాగ్రత్తలు తీసుకోండి

Holi Festival

Festival Of Colors : రంగుల పండుగకు హైదరాబాద్ నగరం సిద్ధమౌతోంది. కరోనా కారణంగా ఎన్నో పండుగలు నిరాడంబరంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వస్తుండడం, వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండడంతో ఈసారి హోలీ కలర్ ఫుల్ గా నిర్వహించుకొనేందుకు నగర ప్రజలు రెడీ అయిపోతున్నారు. వందలాది నడుమ నిర్వహించే రెయిన్ డ్యాన్స్ లు, పలు వేడుకలు నిర్వహించేందుకు సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ పండుగకు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం పాల్గుణ పౌర్ణమి రోజున వస్తుంది. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా ఈ పెస్టివల్ ను నిర్వహించుకుంటారు. హోలీ సందర్భంగా…ఒక రోజు ముందు హోలీక దహనం కార్యక్రమం నిర్వహిస్తారు. రంగులు కొనుక్కోనేందుకు వెళుతుండడంతో మార్కెట్లన్నీ సందడిగా మారాయి. పలు అపార్ట్ మెంట్ లో సమూహంగా వేడుకలు నిర్వహించుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More : Holi : మందుబాబులకు షాక్.. 48 గంటల పాటు మద్యం దుకాణాలు క్లోజ్

హోలీ ఫెస్టివల్ కు నగరానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవడం పరిపాటిగా వస్తోంది. ఇతర సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చే వారని చరిత్రకారులు చెబుతుంటారు. రంగుల పండుగను అధికారికంగా గోల్కొండ కోట వేదికగా జరిపే వారని అంటుంటారు. కుతుబ్ షాహీ పాలకులు అత్యంత ఘనంగా హోలీని నిర్వహించే వారని వెల్లడిస్తున్నారు. అప్పట్లో హోలీ ఆడేటప్పుడు సేంద్రీయ రంగులు వాడేవారు. ఇప్పుడు రసాయనాలతో కూడిన రంగులు మార్కెట్లలో లభ్యమౌతున్నాయి. ఈ రంగులతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాపర్ సల్ఫైట్, మెర్క్యూరీ సల్ఫైట్ తో పాటు ఇతర రసాయనాలతో కలిపిన రంగులను వాడుతున్నారు. వీటిని వాడడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. కళ్లలో పడితే కంటి చూపు పోయే అవకాశం ఉందని, సహజ రంగులతో పండుగను నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.