Directors : సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. కష్టాలన్నీ డైరెక్టర్లకే..

తెలుగు సినిమా డైరెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. వాళ్లు డైరెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అయినా, వాళ్లు డైరెక్ట్ చెయ్యబోయే హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా ఎఫెక్ట్ మాత్రం డైరెక్టర్లకే......

Directors : సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. కష్టాలన్నీ డైరెక్టర్లకే..

Rajamouli

Directors :  ఆకొచ్చి ముల్లు మీద పడ్డా, ముల్లొచ్చి ఆకుమీద పడ్డా ఆకుకే ప్రమాదం అన్నట్టు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు తెలుగు సినిమా డైరెక్టర్లు. సినిమా హిట్ అయ్యిందా మంచిదే. పేరు వస్తుంది కానీ వచ్చే సినిమా మీద అంచనాలు పెరిగిపోతాయి, ప్రెజర్ పెరిగిపోతుంది. ఒక వేళ ఖర్మ కాలి ఫ్లాప్ అయితే నెక్స్ట్ సినిమా ఉంటుందో ఉండదో, ఉంటే కథలో మార్పులు చేయమంటారు. ఇలా చాలా కష్టాలు వస్తున్నాయి మన టాలీవుడ్ డైరెక్టర్స్ కి.

తెలుగు సినిమా డైరెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. వాళ్లు డైరెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అయినా, వాళ్లు డైరెక్ట్ చెయ్యబోయే హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా ఎఫెక్ట్ మాత్రం డైరెక్టర్లకే. ఇటీవల రామ్ ఎన్నో ఆశలతో చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ వారియర్ మూవీ అంచనాల్ని అందుకోలేక ఫ్లాప్ అయ్యింది. దాంతో రామ్ తో నెక్స్ట్ సినిమా తీసే బోయపాటికి తలనొప్పి ఎక్కువైంది. యాక్షన్ మూవీగా వారియర్ హిట్ అవ్వకపోవడంతో మాస్ యాక్షన్ మూవీ స్పెషలిస్ట్ అయిన బోయపాటికి తనతో చెయ్యబోయే సినిమా స్క్రిప్ట్ లో కరెక్షన్స్ చెయ్యమన్నారట రామ్. దాంతో స్క్రిప్ట్ ని రీ రైట్ చేసే పనిలో పడ్డారు బోయపాటి.

Raviteja : రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్

కొరటాలది కూడా సేమ్ సీన్. అబ్బో.. ఆహా.. ఓహో అంటూ తెరకెక్కించిన ఆచార్య సినిమా అస్సలు ఆడియన్స్ కి నచ్చలేదు. కొరటాల కథ బాలేదని, టేకింగ్ అసలే బాలేదని క్రిటిసైజ్ చేయ్యడంతో ఎన్టీఆర్ కూడా తనతో కొరటాల చెయ్యబోయే సినిమాకి కరెక్షన్స్ చెయ్యమని చెప్పారు. అంతకుముందు ఎన్టీఆర్ కోసం రెడీ చేసుకున్న కథకు ఇప్పుడు కంప్లీట్ చేంజెస్ చేసే పనిలో మునిగిపోయారు కొరటాల.

ఆచార్యతో డిజాస్టర్ ఫేస్ చేసిన మెగాస్టార్ కూడా ఎందుకైనా మంచిదని తన అప్ కమింగ్ మూవీస్ స్క్రిప్ట్ విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే తనతో మాస్ సినిమాలు చేస్తున్నడైరెక్టర్లు మెహర్ రమేష్, బాబీకి స్క్రిప్ట్ లో బెటర్మెంట్స్ కూడా చెప్పారు మెగాస్టార్. ఆల్రెడీ లైన్ వినిపించిన డైరెక్టర్లనకు స్క్రిప్ట్ విషయంలో సజెషన్స్ ఇచ్చి కంప్లీట్ సాలిడ్ స్టోరీ రెడీ చెయ్యమన్నారు మెగాస్టార్. దీంతో ఆ సినిమాల డైరెక్టర్స్ అంతా మళ్ళీ స్క్రిప్ట్ ముందేసుకుని కూర్చున్నారు.

ఇక వీళ్లందరిది ఒక బాధ అయితే రాజమౌళిది మరో బాధ. రాజమౌళి సినిమా హిట్ అవుతుంటే వచ్చే సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల RRR కూడా భారీ హిట్ అయి 1000 కోట్లు పైగా కలెక్ట్ చేయడంతో తర్వాత తీయబోయే మహేష్ బాబు సినిమాపైన భారీ అంచనాలు పెరిగాయి. ఇలా సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా డైరెక్టర్స్ కే పని పడుతుంది.