New Goddess : కొత్త దేవత.. దేవత అవతారమెత్తిన ప్రజాప్రతినిధి.. తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాస్‌ పూజలు

స్వయంగా తెలంగాణ ప్రభుత్వ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సైతం అమ్మ ఆశీర్వచనం కోసం వంగి వంగి దండాలు పెట్టారు. అంతా మంచే జరుగుతుందంటూ.. మిరపకాయల పూజలు చేశారు.

New Goddess : కొత్త దేవత.. దేవత అవతారమెత్తిన ప్రజాప్రతినిధి.. తెలంగాణ డీహెచ్‌ శ్రీనివాస్‌ పూజలు

New Godess

The new goddess : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త దేవత వెలిసింది… ఏ చెట్టు కిందో.. పుట్ట మీదో కాదు.. ఓ హైక్లాస్‌ బిల్డింగ్‌లోనే కొలువైంది… నమ్మిన వారికి తానే అంతా అవుతోంది… పూజలు చేస్తే కనికరిస్తానని ప్రచారం చేస్తోంది… వింత వింత పూజలు.. అంతకంటే వింతైన ప్రవర్తనతో విస్తుగొలుపుతోంది… చేతులు ఊపేస్తూ.. కళ్లు కదిలిస్తూ.. ఏవేవో పూజలు చేస్తోంది. తానే ప్రత్యక్ష దేవతనంటూ ప్రవర్తిస్తోంది… ఎల్లప్పుడూ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే ఈ దేవతను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. కొత్త దేవత ఆశీర్వాదం పొందేందుకు సామాన్యులే కాదు.. పెద్ద పెద్ద అధికారులు వచ్చి మరీ వంగి వంగి దండాలు పెడుతూ.. తల్లి దీవెనలు పొందుతున్నారు.

ఇక.. స్వయంగా తెలంగాణ ప్రభుత్వ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సైతం అమ్మ ఆశీర్వచనం కోసం వంగి వంగి దండాలు పెట్టారు. అంతా మంచే జరుగుతుందంటూ.. మిరపకాయల పూజలు చేశారు. ఆయన ఒక్కడే దర్శనం చేసుకోవడం కాదు.. డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెంట తీసుకువెళ్లి కొత్త దేవత దీవెనలు తీసుకున్నారు. అంతేకాకుండా మరో అడుగు ముందుకు వేసి మాతను దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతం అంటూ పొగడ్తలతో ముంచేశారు. అమ్మవారి దర్శనంతో.. డీహెచ్‌ శ్రీనివాస్‌ తన్మయత్వం పొందారు.

Niray Mata : మహిళలకు ప్రవేశం లేని దేవత గుడి..ఏడాదికి 5 గంటలే దర్శనమిచ్చే అమ్మవారు

నిన్నమొన్నటి వరకూ సమీప గ్రామాలకు తెలిసిన ఈ కొత్త దేవత.. ఇప్పుడు మరింత పాపులర్‌ అయిపోయింది. ఒక్కసారిగా కొత్త అమ్మవారు స్టేట్ వైడ్‌ ఫిగర్ అయిపోయింది. ఏకంగా తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ వెళ్లాడు కాబట్టి.. తామూ వెళ్లి ఆ అమ్మవారికి పూజలు చేసేసి.. అర్జంటుగా ఆమె ఆశీర్వాదం తీసేసుకోవాలనుకుంటున్నారట కొంతమంది జనం. డీహెచ్‌ ఏ వెళ్లి పూజలు చేశారంటే.. ఆ తల్లి ఎంత మహిమగలదో అనే చర్చ సమీప గ్రామాల్లో జరుగుతోంది.

సీన్‌ కట్‌ చేస్తే.. ఆమె ఒక ప్రజా ప్రతినిధి, కానీ.. ఆ పని బోర్‌ కొట్టిందో.. ఇందులో ఆదాయం బాగుందనుకుందో.. దేవతగా కొత్త అవతారం ఎత్తింది. భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండలం చీమ్న తండాకు చెందిన భూక్య విజయలక్ష్మి.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరి ఎంపీపీ అయ్యింది. మరొక స్వతంత్ర అభ్యర్థి కూడా చేరడంతో చెరి రెండున్నర సంవత్సరాలు ఎంపీపీగా ఉండేందుకు నిర్ణయించారు. ముందుగా.. విజయలక్ష్మి ఎంపీపీగా భాద్యతలు చేపట్టింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ మధ్య కాలంలో అన్ని మారిపోయాయి. కొత్త అవతరాల్లో ఆదాయం ఎక్కువ వస్తుందనో లేక.. మరేదైనా కారణమో తెలీదు కానీ.. ఒక్కసారిగా ఎంపీపీ కాస్తా.. అమ్మవారైపోయింది.

Ap : గ్రామ దేవత విగ్రహాన్ని పెకిలించి..గుప్తనిధుల కోసం తవ్వకాలు

తానే ప్రత్యంగిరాదేవి అవతారం అంటూ భక్తులను జమ చేయడం మొదలు పెట్టింది విజయలక్ష్మి. హోమాలు.. యాగాలు అంటూ చిత్రమైన రీతిలో ఎండుమిర్చి కాలుస్తూ.. అంతే చిత్రమైన రీతిలో హావభావాలు, ప్రవర్తనతో విస్తుపోయేలా ప్రవర్తిస్తోంది. తానే సాక్షాత్తు అమ్మవారి అవతారం అంటూ.. ప్రత్యక్ష దేవతనంటూ అందర్నీ నమ్మించే ప్రయత్నాలు చేస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి తన భక్తులు వచ్చి తనకు సేవలు చేసుకుంటారు అంటూ గొప్పలు చెప్తుంది. తన భక్తులు సన్మార్గంలో నడవలంటూ.. తను మాత్రం తనకు నచ్చిన దారిలో నడుస్తోంది. తను నడిచే నడక.. చూపు, మాట అంతా అమ్మవారిలా కనిపించేలా తెగ కవర్ చేస్తూ.. భక్తులను బుట్టలో వేస్తోంది. ఆధ్యాత్మిక తన్మయత్వంతో చేసే నృత్యాలు.. ఉత్సాహంగా చేసే డాన్సులు.. చిత్రవిచిత్ర హావభావాలు.. ఇవన్నీ కలగలిపి సదరు ఎంపీపీని దేవతను చేసేశాయ్‌.

ఇక ఆమె భర్త కూడా సింగరేణిలో డ్యూటీకి వెళ్లకుండా.. భార్యనే దేవతగా కొలుచుకుంటున్నాడు. భార్య సమక్షంలో.. అన్ని రకాల పూజలను దగ్గరుండీ మరీ నిర్వహిస్తున్నాడు. చాలా విషయాల్లో వివాదాలు ఉన్న ఈ ఎంపీపీ.. దేవత అవతారం ఎత్తి భక్తులకు దీవెనలు అందించేస్తోంది. తను దేవతను అని చెప్పుకుంటూనే అంగీకారం ప్రకారం వేరొకరికి ఎంపీపీ ఇవ్వాల్సి ఉన్నా.. ఇచ్చేది లేదంటూ భీష్మించుకుని కూర్చుంది. ఇదే విషయంపై గత సర్వసభ్య సమావేశంలో గొడవలు సైతం జరిగాయి.

Antique Pieces: రూ.40 కోట్ల విలువైన హిందూ దేవతల పురాతన విగ్రహాలు స్వాధీనం

ఇక.. డీహెచ్‌ స్వయంగా పూజల్లో పాల్గొనడం.. తన జన్యధన్యమైపోయిందంటూ స్టేట్‌మెంట్లు ఇవ్వడం చర్చకు దారి తీస్తున్నాయి. మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాల్సిన వారే అవగాహన లేక.. మనుషులనే దేవతలను చేసేయడంపై కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే.. పూజలు, హోమాలు, అన్నదానాల పేరుతో చేసే దందా అంత ఇంత కాదు. భూత, భవిష్యత్, వర్తమానం గురించి చెప్తామంటూ అమాయక ప్రజలను మోసం చేసే ఇలాంటి కొత్తా దేవుళ్లను, వారికి అండగా ఉండే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఇదే దారిలో మరింత మంది వెళ్లే ప్రమాదం ఉంది.