Niray Mata : మహిళలకు ప్రవేశం లేని దేవత గుడి..ఏడాదికి 5 గంటలే దర్శనమిచ్చే అమ్మవారు

మహిళలకే ప్రవేశం లేని అమ్మవారి గుడి అది. కొండపై పచ్చని ప్రకృతి మధ్యన వెలసిన ఆ అమ్మను దర్శించుకోవటానికి భారీగా భక్తులు తరలి వస్తారు. ఎందుకంటే సంవత్సరానికి కేవలం ఐదు రోజులే అమ్మవారు భక్తులకు దర్శమిస్తారు. అందుకే ఆ ఐదు రోజులు భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి ఎంతో భక్తిగా తరలివస్తారు. ఆ అమ్మే నిరయ్‌ మాతా అమ్మవారు.

Niray Mata : మహిళలకు ప్రవేశం లేని దేవత గుడి..ఏడాదికి 5 గంటలే దర్శనమిచ్చే అమ్మవారు

Niray Mata Temple (4)

Updated On : July 26, 2021 / 6:01 PM IST

Niray Mata temple : కొండపై కొలువైన నిరయ్‌ మాతా అమ్మ..చాలా ప్రత్యేకతలు కలిగిన అమ్మవారు. ఈ అమ్మవారి దేవాలయానికి మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం సంవత్సరంలో కేవలం ఐదు అంటే ఐదు రోజులే తెరిచి ఉంచుతారు. అంతేకాదు ఈ అమ్మవారు మహిళే అయినా ఈ గుడిలోకి మహిళల నిషేధం ఉండటం గమనించాల్సిన విషయం.కేవలం ఐదు రోజులుమాత్రమే ఉంటుంది.దీంతో సంవత్సరమంతా వేచి ఉన్న భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి ఈ ఐదురోజులు భారీగా తరలివస్తారు.

ఇంతకీ ఈ నిరయ్ మాతా దేవాలయం ఎక్కడటంటే ఛతీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై కొలువై ఉంటుంది అమ్మ. సమయం తక్కువ ఉండడంతో ఆ రోజున వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. గరియాబంద్‌ జిల్లా కేంద్రానికి 12 కి.మి దూరంలో ఉన్న కొండపై ఈ గుడి ఉంటుంది. ప్రతి ఏడాది తెలుగు మాసాల లెక్కలో ఛైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉ.9 గంటల వరకే భక్తులకు దర్శనం కల్పిస్తారు. తిరిగి వచ్చే ఏడాది ఛైత్ర నవరాత్రి వరకు ప్రవేశం ఉండదు.

ఈ ఐదు గంటలు దర్శన సమయం అనంతరం తిరిగి మరుసటి ఏడాది ఛైత్ర నవరాత్రి వచ్చేదాక ఆలయంలోకి ఎవరూ రాకూడదని నిబంధనలున్నాయి. అలాగే ఈ గుడిలోకి మహిళల ప్రవేశం నిషేధం ఉంది. ప్రవేశిస్తే చెడు జరుగుతుందని స్థానికుల నమ్మకం. అందుకే అమ్మవారి గుడిలోకి మహిళలను ప్రవేశించనివ్వరు.