Dead Body : చెల్లి మృతదేహంతో అక్క.. నాలుగు రోజులుగా ఇంట్లోనే

స్వాతి, శ్వేత ఇద్దరూ అక్కాచెళ్లెళ్లు. గత రెండు నెలల క్రితం పెద్దపల్లి జిల్లా ప్రగతి నగర్ లో ఓ ఇంట్లోకి అద్దెకు వచ్చారు. వారు ఎవరితోనూ మావన సంబంధాలు కొనసాగించలేదు.

Dead Body : చెల్లి మృతదేహంతో అక్క.. నాలుగు రోజులుగా ఇంట్లోనే

Dead

Updated On : January 17, 2022 / 9:06 PM IST

young sister’s dead body : చెల్లి మృతదేహంతో ఇంట్లోనే ఉండిపోయిందో సోదరి. పెద్దపల్లికి చెందిన స్వాతి.. తన అక్కతో కలిసి ప్రగతి నగర్‌లో ఉంటోంది. అయితే.. ఇటీవలే స్వాతి చనిపోయింది. అయినా ఆమె సోదరి ఎవరికీ విషయాన్ని చెప్పకుండా.. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేసింది. దుర్వాసన వస్తుండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఏం జరిగిందనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే తీవ్ర జ్వరంతో తన చెల్లి చనిపోయిందని స్వాతి సోదరి చెబుతోంది. డబ్బులు లేకపోవడంతో.. ఆసుపత్రికి తీసుకెళ్లలేదని.. నాలుగు రోజుల క్రితం చనిపోయిందని చెబుతోంది.

స్వాతి, శ్వేత ఇద్దరూ అక్కాచెళ్లెళ్లు. గత రెండు నెలల క్రితం పెద్దపల్లి జిల్లా ప్రగతి నగర్ లో ఓ ఇంట్లోకి అద్దెకు వచ్చారు. వారు ఎవరితోనూ మావన సంబంధాలు కొనసాగించలేదు. వారి పని చూసుకుని ఇంట్లోనే ఉండేవారు. అయితే నాలుగు రోజుల క్రితం సోదరి చనిపోయింది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా మృతదేహంతోనే ఉండిపోయింది. సోదరి చెప్పినటువంటి మాటల ప్రకారం ఆమె మానసిక స్థితి బాగా లేదని పోలీసులు అంటున్నారు.

Telangana Cabinet : తెలంగాణలో ఫారెస్ట్, మహిళా యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం

గత కొంతకాలంగా సోదరి అనారోగ్యంతో బాధపడింది, డబ్బులు లేకపోవడంతోనే బయటికి చెప్పలేకపోయానని స్వాతి చెప్పింది. మృతదేహాన్ని పోలీసులు పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.