TRSLP meeting : మార్చి21న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరుకావాలని ఆదేశాలు

యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ధర్నాలు, ఆందోళనలు చేసే విషయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

TRSLP meeting : మార్చి21న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరుకావాలని ఆదేశాలు

Trslp

TRSLP meeting : టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం సోమవారం(మార్చి21, 2022) తేదీన జరుగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో ఉదయం 11.30 గంటలకు టీఆర్ఎస్ఎల్పీ భేటీ కానుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ధర్నాలు, ఆందోళనలు చేసే విషయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. యాసంగి వరి ధాన్యాన్ని వందశాతం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకునేందుకే సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పుకోవచ్చు.

Telangana CM : మంత్రులతో సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్.. ఎందుకు ?

రాష్ట్రంలో జరిగే ఆందోళనలకు అనుగుణంగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో నిరసనలు తెలుపనున్నారు. ఈ భేటీ తర్వాత సీఎం కేసీఆర్, మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రమంత్రులను టీఆర్ఎస్ బృందం కలవనుంది. అవసరమైతే ప్రధానిని కలవాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ తరహాలో 100 శాతం వరిధాన్యం కొనాలని టీఆర్ఎస్ అంటోంది.