Omicron India : భారత్ లో 3,623 కు చేరిన ఒమిక్రాన్ కేసులు

ఒమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, గుజరాత్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా ఉన్నాయి.

Omicron India : భారత్ లో 3,623 కు చేరిన ఒమిక్రాన్ కేసులు

India Omicron

Omicron cases in India : భారత్ లో ఒకవైపు కరోనా..మరోవైపు ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 3,623 కు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ నుంచి 1409 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, గుజరాత్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా ఉన్నాయి.

మహారాష్ట్రలో 1009, ఢిల్లీలో 513, కర్ణాటక 441, రాజస్థాన్ లో 373, కేరళలో 333, గుజరాత్ లో 204, తమిళనాడులో 185, హర్యానాలో 123, తెలంగాణలో 123, ఉత్తరప్రదేశ్ లో 113, ఒడిశాలో 60, ఏపీలో 28 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో సగటు పాజిటివిటి రేటు 10.21 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Corona India : భారత్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు

మరోవైపు దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో మరోసారి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 327 మంది మృతి చెందారు. నిన్నటితో పోలిస్తే 12 శాతం కోవిడ్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,90,611 యక్టీవ్ కేసులు ఉన్నాయి.

దేశంలో ఇప్పటి వరకు 3,55,28,004 కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 4,83,790 మరణించారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 41,434 కరోనా కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో 18,802, ఢిల్లీలో 20,181, తమిళనాడులో 10,978, కర్ణాటకలో 8906 కేసులు, కేరళలో 5944 నమోదు అయ్యాయి.