Eatala Rajender : వాళ్లు వదిలిపెట్టరు, ప్రతీకారం తీర్చుకుంటారు.. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ హెచ్చరిక

గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్ పీరియడ్ మూడేళ్లు పెట్టిన కేసీఆర్ మరో ఏడాదికి పెంచి నాలుగేళ్లు చేయడం దుర్మార్గం. Eatala Rajender

Eatala Rajender : వాళ్లు వదిలిపెట్టరు, ప్రతీకారం తీర్చుకుంటారు.. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ హెచ్చరిక

Eatala Rajender(Photo : Twitter, Google)

Updated On : July 25, 2023 / 8:21 PM IST

Eatala Rajender – CM KCR : బీజేపీ తెలంగాణ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. కేసీఆర్ ను ప్రశ్నించినా, అడ్డుకున్నా అస్సలు సహించరు అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు తప్ప నిజాలు చెప్పటం లేదని ధ్వజమెత్తారు ఈటల. కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన గెస్ట్ లెక్చరర్స్ హామీ నెరవేరలేదన్నారు. హైకోర్టు తీర్పును కూడా ముఖ్యమంత్రి అపహాస్యం చేశారని సీరియస్ అయ్యారు.

”సెలవులు వస్తే గెస్ట్ లెక్చరర్స్ కు జీతాలు రావటం లేదు. గెస్ట్ లెక్చరర్స్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా. అరెస్ట్ చేసిన గెస్ట్ లెక్చరర్స్ ను తక్షణమే విడిచి పెట్టాలి. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 12 నెలల జీతాలు ఇవ్వాలి. కేసీఆర్ ను ప్రశ్నించినా, అడుకున్నా సహించరు. దేశ ప్రధాని కార్మికుల కాళ్లు కడుగుతుంటే.. కేసీఆర్ కార్మికులను ఉద్యోగాల నుంచి తీసేశారు. ఆర్టీసీ సమ్మె చేస్తే అశ్వద్దామ రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని ఆదేశించారు. భూముల మీద కేసీఆర్ కన్నేశారు.

Also Read: వైఎస్ షర్మిల బాణం కాంగ్రెస్ చేతికి చిక్కిందా.. అందుకే సికింద్రాబాద్ సీట్‌పై కన్నేశారా?

వీఆర్ఏలు సమ్మె చేస్తే ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు వీఆర్ఏ సమస్యను నిర్వీర్యం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్ పీరియడ్ మూడేళ్లు పెట్టిన కేసీఆర్.. దాన్ని మరో ఏడాదికి పెంచి నాలుగేళ్లు చేయడం దుర్మార్గం. ఇప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణ ప్రజలు ప్రేమకు లొంగుతారు తప్పితే దబాయింపులకు లొంగరు.

ఉద్యోగులను పెట్టిన హింసకు ప్రతీకారం తీర్చుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తే వచ్చే పంట కన్నా కరెంట్ బిల్లు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. కౌలు రైతుల సమస్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి. రైతుబంధు పేరుతో అన్ని సబ్సిడీలను ఎత్తేశారు. పందిరి వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎక్కడైనా పంట పండుతుందా? కేసీఆర్ చెప్పాలి” అని ఈటల రాజేందర్ నిలదీశారు.

Also Read: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు, కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించిన ధర్మాసనం