SBI Report: కరోనా సెకండ్ వేవ్ తగ్గినట్లే.. థర్డ్ వేవ్ ప్రభావం ఎన్నిరోజులంటే?

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేయగా.. ఊహకందని విధంగా వైరస్ వ్యాప్తి చెంది ఇబ్బంది పెట్టింది. కాస్త ఉపశమనం ఇస్తూ.. భారత్‌లో సెకండ్ వేవ్‌ తగ్గుముఖం పట్టగా.. జనం ఊపిరి పీల్చుకునేలోపే థర్డ్‌ వేవ్‌ ముప్పు గురించి అధికారులు హెచ్చరిస్తున్నారు.

SBI Report: కరోనా సెకండ్ వేవ్ తగ్గినట్లే.. థర్డ్ వేవ్ ప్రభావం ఎన్నిరోజులంటే?

Third Covid Wave Could Be As Severe As Second May Last For 98 Days

Third wave Severe as Second: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేయగా.. ఊహకందని విధంగా వైరస్ వ్యాప్తి చెంది ఇబ్బంది పెట్టింది. కాస్త ఉపశమనం ఇస్తూ.. భారత్‌లో సెకండ్ వేవ్‌ తగ్గుముఖం పట్టగా.. జనం ఊపిరి పీల్చుకునేలోపే థర్డ్‌ వేవ్‌ ముప్పు గురించి అధికారులు హెచ్చరిస్తున్నారు. 98 రోజులపాటు థర్డ్‌వేవ్‌ కరోనా వణికించేందుకు రెడీగా ఉందని అంటున్నారు. సెకండ్ వేవ్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్న అధికారులు.

థర్డ్ వేవ్ విషయంలో మాత్రం ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని భావిస్తున్నారు. కరోనా ముప్పు తప్పించుకోవాలంటే వ్యాక్సిన్ మాత్రమే ఏకైక మార్గం అని భావిస్తున్నారు నిపుణులు. అందరూ వ్యాక్సిన్‌ వేసుకుంటేనే ముప్పు తప్పుతుందని అంటున్నారు నిపుణులు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ 108రోజులు పాటు వణికించగా.. థర్డ్‌ వేవ్‌ కాస్త భిన్నంగా ఉంటుందని, 98రోజుల పాటు అత్యంత ప్రభావం చూపుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈకో వ్రాప్‌ వెల్లడించింది. దేశంలో కరోనా పరిస్థితులపై ఎస్బీఐ అధ్యయనం జరిపి నివేదక ఇచ్చింది. ముందస్తు చర్యలు తీసుకుంటే మాత్రం థర్డ్‌ వేవ్‌ ముప్పును ఎదుర్కొవచ్చని నివేదికలో స్పష్టంచేసింది.

వైరస్ ద్వారా మరణించే వారి సంఖ్యను తగ్గించవచ్చని, సెకండ్ వేవ్‌లో లక్షా 62వేల మంది మార్చ్‌ నెలలో చనిపోయారని, రెండు నెలల్లో మరణాల రేటు రెండింతలై 3లక్షల 30 వేలకు చేరిందని వెల్లడించింది. భారత్‌లో వైద్యానికి సంబంధించి సదుపాయాల్లో లోపమే ఇందుకు కారణమని ఆసుపత్రుల్లో సరిపడా బెడ్లు, ఆక్సిజన్ సదుపాయం లేవని, అందువల్ల జనం పిట్టల్లా రాలిపోయారని నివేదికలో చెప్పింది ఎస్బీఐ.

సెకండవ్‌ వేవ్ తగ్గుముఖం పట్టినా.. అజాగ్రత్తగా ఉండరాదని, థర్డ్‌వేవ్‌పై జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. వ్యాక్సిన్ పంపిణీలో వేగం పెంచితే మూడో దశ ముప్పును తట్టుకోగలం అంటున్నారు. ఇప్పటి వరకు దేశ జనాభాలో 3.2 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ జరిగిందని లెక్కలు చెప్తుండగా.. వ్యాక్సినేషన్‌ ద్వారానే సెకండ్‌ వేవ్‌లో 20 శాతంగా ఉన్న పాజిటివిటీని థర్డ్‌ వేవ్‌లో 5 శాతానికి తగ్గించగలమని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది.