Viral ‘onion’: ఈ ఉల్లిని కట్‌ చేస్తే ‍కన్నీళ్లు రానేరావు..! మరి ఆ సీక్రెట్ ఏంటో తేల్చేసుకోండీ..

ఇప్పటి వరకు మీరు ఉల్లిని కట్‌ చేస్తే ‍కన్నీళ్లు రావటం చూసారు. కట్ చేసి కన్నీరు పెట్టి ఉంటారు. కానీ ఈ ఉల్లి కట్ చేస్తే కన్నీరు రానేరాదు. కన్నీరు పెట్టించని ఉల్లి వైరల్.

Viral ‘onion’: ఈ ఉల్లిని కట్‌ చేస్తే ‍కన్నీళ్లు రానేరావు..! మరి ఆ సీక్రెట్ ఏంటో తేల్చేసుకోండీ..

This Onions Without Shedding My Tears

This ‘onion’ Cutting won’t make your eyes watery: ఉల్లిపాయలను కట్‌ చేస్తే కళ్లవెంట బొటబొటా నీళ్లు జలజలా రాలిపోతాయి. చాలాసార్లు ఉల్లి ధరలు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంటాయి. అది వేరే సంగతి. కానీ కన్నీరు పెట్టకుండా ఉల్లిపాయ కోయటం అంటే అదో పెద్ద అడ్వంచరే అనాలి. ఒక్క ఉల్లిపాయ కట్ చేస్తే దాని ఘాటుకు కంట్లోంచే కాదు ముక్కులోంచి కూడా నీరు జలపాతంలా కారిపోతాయి. కళ్లు తుడిచేసుకుంటు..ముక్కు ఛీదేసుకుంటు ఉల్లిపాయలు కోయాల్సిందే..కోసినంత సేపు ‘నువ్వు ఎంత ఏడ్చినా..నేను మాత్రం ఏమాత్రం తగ్గేదేలే’అన్నట్లుగా ఉల్లిపాయ ఏమాత్రం ఆగదు. కన్నీరు పెట్టించకమానదు. ఉక్కిరిబిక్కిరి చేసే పారేస్తుంది కోసినంత సేపు.. ఇలా ఉల్లిగడ్డలు కోసినప్పుడల్లా ఏంటిరా బాబు ఈ ఉల్లిఘాటు..కన్నీరు పెట్టించని ఉల్లిపాయలుంటే బాగుండు అనిపిస్తుంది.

ఇదిగో ఈ ఉల్లి అటువంటిదే. కట్ చేసినా కన్నీరు రాదు. ఈ వీడియోలో కనిపించే ఉల్లిని కట్‌ చేస్తే మాత్రం కళ్లు చెమ్మగిల్లవు. కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిపాయలా? ఆశ్చర్యంగా ఉందే.. ఎక్కడున్నాయ్‌! వాటి ధర ఎక్కువేమో..మనకు దొరుకుతాయా? అని తెగ ప్రశ్నలు వేసేసుకోకండీ..ఆ కన్నీరు రాని ఉల్లిుగరించి విశేషాలు తెలిసేసుకోండీ..

అక్టోబర్ లో సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఉల్లి వీడియో వైరల్ గా రన్ అవుతోంది. ఈ స్పెషల్ ఉల్లి గురించి తెలిస్తే వార్నీ ఇదా? అనుకోకమానరు.నిజానికి.. అచ్చం ఉల్లిలాగే కనిపించే, ఉల్లి రూపంలో తయారు చేసిన రియలిస్టిక్‌ కేక్‌ అది. ఏంటీ కంట్లోంచి నీరు కాదు నోటి వెంట తిట్లు వస్తున్నాయా? ఊరికే జస్ట్ ఫర్ ఫన్. కాస్త రిలేక్సేషన్ కోసం..సోషల్ మీడియాలో వినూత్నంగా ఆలోచించేవారు ఉన్నంత కాలం ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తునే ఉంటాయి అనటానికి ఈ ఉల్లి కేక్ ఓ ఎగ్జాంపుల్..ఇక దీన్ని చూసిన నెటిజన్లు రియాక్షన్లు ఎలా ఉన్నాయంటే..ప్రశ్నలు..కౌంటర్లు లెక్కలేనన్ని వస్తున్నాయి..

‘అది నిజమైన ఉల్లికానప్పుడు దానికి ఉల్లి తొడుగు ఎందుకు తొడిగారు’? అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు..ఆ..ఆనియన్‌ స్కిన్‌ కూడా రియల్ కాదు..అదికూడా వెనీలాతో తయారుచేసినదని.. ఆ ఉల్లి తొక్కను కూడా భేషుగ్గా తినేయొచ్చని చెబుతున్నారు ఈ ఉల్లి కేక్‌ను తయారు చేసిన బేకర్‌..

 

View this post on Instagram

 

A post shared by Sideserf Cake Studio (@sideserfcakes)