BRS Party: బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రెటరీగా తివారీ.. మహారాష్ట్ర డివిజన్ కో-ఆర్డినేటర్లను ప్రకటించిన కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించడంపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఆయా రాష్ట్రాలవారిగా కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలో యూపీ జనరల్‌ సెక్రెటరీ బాధ్యతలను హిమాన్షు తివారీకి అప్పగించిన కేసీఆర్, మహారాష్ట్ర డివిజన్‌ కోఆర్డినేటర్లను నియమించారు.

BRS Party: బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రెటరీగా తివారీ.. మహారాష్ట్ర డివిజన్ కో-ఆర్డినేటర్లను ప్రకటించిన కేసీఆర్

CM KCR

BRS Party: బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించడంపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఆయా రాష్ట్రాలవారిగా కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరించే క్రమంలో పలు రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ తాజాగా మహారాష్ట్ర, యూపీల్లో పలు విభాగాల్లో పార్టీ నేతలను నియమించారు. పక్కనేఉన్న మహారాష్ట్రపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం విధితమే. అంతేకాక, ఇటీవలే మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మానిక్ కదమ్‌ను నియమించిన అధినేత.. తాజాగా రాష్ట్ర డివిజన్ కో- ఆర్డినేటర్లను నియమించారు.

 

 

మహారాష్ట్రంలోని ఆరు డివిజన్లకు బీఆర్ఎస్ కో- ఆర్డినేటర్లను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాసిక్ డివిజన్ కోఆర్డినేటర్‌గా దశరథ్ సావంత్, పూణే డివిజన్ కో-ఆర్డినేటర్‌గా బాలా సాహెబ్ జయరాం దేశ్ముఖ్, ముంబై డివిజన్ కో- ఆర్డినేటర్‌గా విజయ తానాజీ మోతే, ఔరంగాబాద్‌కు సోమనాథ్ తోరట్, నాగపూర్ డివిజన్‌కు డ్యానెష్ వకుడ్కర్, అమరావతి డివిజన్‌కు నిఖిల్ దేశముఖ్‌లను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.

 

ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతలను హిమాన్షు తివారీకి సీఎం కేసీఆర్ అప్పగించారు. హిమాన్షు జానుపూర్‌కు చెందిన రాజకీయ నాయకుడు. హిమాన్షు ఇటీవలే బీఆర్ఎస్‌లో చేరారు. ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.