Summer Drinks : వేసవి ఎండల కారణంగా ఎదురయ్యే డీహైడ్రేషన్ కు చెక్ పెట్టాలంటే ?

వేసవి పానీయాలలో మొదటి స్థానం మజ్జిగదే. వేసవికాలంలో మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోబయాటిక్స్‌ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రోబయోటిక్స్‌ మీ గట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయి.

Summer Drinks : వేసవి ఎండల కారణంగా ఎదురయ్యే డీహైడ్రేషన్ కు చెక్ పెట్టాలంటే ?

SUMMER DRINKS

Summer Drinks : వేసవి ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎండవేడి కారణంగా డీహైడ్రేషన్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. వేసవి తాపానికి గొంతెండి పోతోంది. ఎండలో తిరిగి అలసిపోయిన ప్రాణానికి కొన్ని రకాల పానీయాలు ఎంతగానో తోడ్పడతాయి.

అంతేకాకుండా వేసవిలో రోగనిరోధక వ్యవస్థ మాదిరిగానే, పొట్టలో కూడా అనేక మార్పులు జరుగుతాయి. ఈ కారణంగా జీర్ణక్రియ సమస్యలు ఎక్కువ అవుతాయి. అతిసారం, UTI, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు అధికమవుతాయి.

READ ALSO : Watermelon : వేసవిలో మీ శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడే పుచ్చకాయ !

ఈ సమస్యలకు చెక్‌ పెట్టడానికి శరీరాన్ని చల్లబరిచే ఆహారం, పానీయాలు తీసుకోవటం చాలా ముఖ్యం. వేసవి కాలంలో డీహైడ్రేషన్‌ను తగ్గించడానికి పానీయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఆ పానీయాలను మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

వేసవి కాలంలో మన ఆరోగ్యానికి మేలు కలిగించే వివిధ రకాల పానీయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

వేసవిలో తీసుకోవాల్సిన పానీయాలు ;

నిమ్మరసం ;

వేసవి కాలం నిమ్మరసం కలిపి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లెమన్ వాటర్ తీసుకోవడం ద్వారా వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. నిమ్మకాయలో చాలా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని వేడి నుండి రక్షించడంలో తోడ్పడతాయి. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి నిమ్మరసంలోని యాసిడ్స్‌ తోడ్పతాయి. దీంతో, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రావు.

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా ఒంట్లో నీటిశాతం పడిపోతుంది. రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలావరకు నివారించుకోవచ్చు. మీరు సబ్జాగింజలు నానబెట్టిన నీటిలో నిమ్మరసం పిండి తీసుకుంటే ఇంకా మంచిది. ఈ డ్రింక్‌ శరీరంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది.

మజ్జిగ ;

వేసవి పానీయాలలో మొదటి స్థానం మజ్జిగదే. వేసవికాలంలో మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోబయాటిక్స్‌ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రోబయోటిక్స్‌ మీ గట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయి. ఇందులో క్యాల్షియం, ప్రొటీన్‌, బి12 వంటి విటమిన్లు పుష్కలం. ఇందులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, కార్బోహైడ్రేట్లు మరియు లాక్టోస్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇవి మనసును, శరీరాన్ని శాంత పరచడమే కాకుండా వడదెబ్బ నుంచీ రక్షిస్తాయి. మీకు మజ్జిగ ఇష్టం లేదంటే స్మూతీలా గానీ, పండ్ల ముక్కలతో కలిపికానీ ట్రై చేయవచ్చు. ఏదేమైనా ఇంట్లో ప్రతి ఒక్కరూ రోజూ కనీసం ఒక్క గ్లాసు మజ్జిగైనా తాగేలా చూసుకోవాలి. వేసవి కాలంలో మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

READ ALSO : Bloating And Gas : వేసవిలో ఈ ఆహారాలు తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు తెలుసా ?

కొబ్బరి నీళ్ళు ;

వేసవి కాలంలో యూరినరీ సమస్యలు, మూత్రవిసర్జన సమయంలో మంట వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరికి కొబ్బరి నీళ్లు బెస్ట్‌ డ్రింక్‌ అని చెప్పాలి. కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి, ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.

ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో 9 శాతం ఫైబర్‌ ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎసిడిటీ వేధిస్తుంటే.. గ్లాస్‌ కొబ్బరి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నీరు వేసవిలో మిమ్మల్ని ఉత్తేజపరచటంతోపాటుగా ఇది విటమిన్లు, ఖనిజాల గొప్ప మూలం. పోషకాలను అందిస్తుంది. కొబ్బరి నీళ్ల వల్ల మీరు హీట్ స్ట్రోక్, ఇతర సంబంధిత వ్యాధులని నివారించవచ్చు.

చెరుకు రసం ;

వేసవిలో చల్లని చెరకు రసం తాగితే అలసట, నిస్సత్తువ మాయం అవుతాయి. శరీరాన్ని రీహైడ్రేట్‌ చేస్తుంది. చెరకు రసంలో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు కలుగుతుంది. వేసవిలో మలబద్ధకం సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి చెరకు రసం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. చెరకు రసంలో మెగ్నీషియం ,ఐరన్ వంటి ఇతర ఖనిజాలు ఉన్నాయి, ఇవి పోషకాహార లోపాన్ని సరిచేయడంలో సహాయపడతాయి.

ఇది శరీరంలో రక్తం ,ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. పడుకునే ముందు తాగితే చాలా మంచిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, మంచి నిద్రకు సహాయపడుతుంది.

READ ALSO : Grapes : వేసవిలో చర్మానికి రక్షణగా ద్రాక్ష!

సబ్జా గింజల నీరు ;

ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి.

పుచ్చకాయ జ్యూస్ ;

వేసవిలో ఎక్కవ మంది ఇష్టంగా తినే పండు పుచ్చకాయ. ఈ జ్యూస్‌ను కూడా చాలా మంది ఇష్టపడతారు. చాలా సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. పుచ్చకాయ ముక్కలు తిన్నా, కొంచెం చల్లగా జ్యూస్ రూపంలో తీసుకున్నా శరీరానికి, మనసుకు హాయిగా ఉంటుంది. పుచ్చకాయ గింజల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు కూడా ఉన్నాయి. ఎండిన పుచ్చకాయ గింజలను తినడం ద్వారా అధిక స్థాయి రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవచ్చు.