Tollywood : చిరంజీవి అప్పుడు చెప్పింది నిజమేనా? ఇప్పుడు అనిల్ సుంకర కూడా.. టాలీవుడ్ డైరెక్టర్స్ ఆ తప్పు చేస్తున్నారా?

ప్రముఖ నిర్మాతలు, మెగాస్టార్ కూడా డైరెక్టర్స్ మీద కామెంట్స్ చేయడంతో నిజంగానే డైరెక్టర్స్ పూర్తి బౌండ్ స్క్రిప్ట్ లేకుండా, కథ లేకుండా సినిమాలు తీద్దామనుకునుంటున్నారా? అసలు ఏ ధైర్యంతో ఇలా సినిమాలు చేస్తున్నారు?

Tollywood : చిరంజీవి అప్పుడు చెప్పింది నిజమేనా? ఇప్పుడు అనిల్ సుంకర కూడా.. టాలీవుడ్ డైరెక్టర్స్ ఆ తప్పు చేస్తున్నారా?

Tollywood Directors making movies without bounded script

Tollywood :  తాజాగా అఖిల్(Akhil) ఏజెంట్(Agent) సినిమా ప్రేక్షకుల ముందుకి రాగా ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా విషయంలో నిర్మాత అనిల్ సుంకర(Anil Sunkara) సంచలన ట్వీట్ చేశాడు. ఏజెంట్ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకుంటూ అనిల్ సుంకర చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అనిల్ సుంకర తన ట్వీట్ లో.. ఏజెంట్ రిజల్ట్ పూర్తి బాధ్యత మేమే వహిస్తాం. ఇది ఒక పెద్ద రిస్క్ అని తెలిసి కూడా ముందుకి సాగాము. బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే కథ ఓకే చేసి పెద్ద మిస్టేక్ చేశాము. ఈ ప్రాజెక్ట్ మేకింగ్ లో చాలా తప్పులు, ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమా ఫెయిల్యూర్ కి రీజన్ చెప్పాలి అనుకోవడం లేదు, తప్పంతా మాదే. సినిమాపై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒకరికి హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఏజెంట్ విషయంలో జరిగిన తప్పులు మా భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో జరగకుండా చూసుకుంటామని తెలిపారు. అలాగే ఇది డబ్బులపరంగా కూడా మాకు చాలా పెద్ద లాస్ అని అన్నారు అనిల్ సుంకర.

ఈ ట్వీట్ లో డైరెక్ట్ గా బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్ కి వెళ్లామని చెప్పారు. అంటే ఇండైరెక్ట్ గా డైరెక్టర్ మీద కామెంట్స్ చేశారు అనిల్ సుంకర. డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కేవలం ఒక లైన్ ని పట్టుకొని సరైన స్క్రీన్ ప్లే లేకుండానే షూట్ కి వెళ్లారని తెలుస్తుంది. ఏజెంట్ సినిమా చూసిన ఆడియన్స్ కూడా కథ, నేరేషన్, స్క్రీన్ ప్లే ఏది లేదని కామెంట్స్ చేశారు.

కొన్నాళ్ల క్రితం ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత చిరంజీవి కూడా పలు సినిమా ఈవెంట్స్ లలో డైరెక్టర్స్ మీద కామెంట్స్ చేశారు. డైరెక్టర్స్ సెట్ కి వచ్చి డైలాగ్స్ రాస్తున్నారని, అప్పటికప్పుడు స్క్రీన్ ప్లే, కథని మార్చుకుంటున్నారని కామెంట్స్ చేశారు. అప్పట్లోనే ఇవి టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. ఇండైరెక్ట్ గా ఈ కామెంట్స్ ఆచార్య డైరెక్టర్ కొరటాల శివనే అన్నారని అంతా అనుకున్నారు. ఒక్కసారి కాదు ఏకంగా మూడు, నాలుగు సార్లు డైరెక్టర్స్ గురించి చిరంజీవి కామెంట్స్ చేశారు. వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయిన తర్వాత కూడా డైరెక్టర్స్ ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో చిరంజీవి కామెంట్స్ చేశారు. నిర్మాతల డబ్బులు వేస్ట్ చేయొద్దని, సీన్స్ ని పేపర్ మీద పూర్తిగా ఫైనల్ అనుకున్న తర్వాతే షూట్ కి వెళ్ళమని, ఇష్టమొచ్చింది షూట్ చేసి ఆ తర్వాత కట్ చేసి, ఇలా నిర్మాతల డబ్బులు పోగొట్టొద్దని డైరెక్టర్స్ కి సలహాలు ఇచ్చారు మెగాస్టార్. ఇదంతా మెగాస్టార్ ఏదో ఒక డైరెక్టర్ తో అనుభవించే అన్నట్టు తెలుస్తోంది.

Agent : ఏజెంట్ విషయంలో తప్పంతా మాదే.. చిరంజీవి సినిమాలో అది జరగదు.. నిర్మాత ట్వీట్!

ఇక ఇటీవల దిల్ రాజు కూడా శాకుంతలం సినిమా నాకు పెద్ద జర్క్ ఇచ్చింది. నేను బాగా నమ్మాను. కానీ రిజల్ట్ ఇలా వచ్చింది అని ఇండైరెక్ట్ గా డైరెక్టర్ గుణశేఖర్ ని నమ్మాను అని కామెంట్స్ చేశాడు.

అలాగే ఇటీవల ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇప్పుడు అందరూ కాంబినేషన్స్ నమ్మి సినిమాలు చేస్తున్నారు, కథలు నమ్మి ఎవరూ చెయ్యట్లేదు, అందుకే ఎక్కువ ఫ్లాప్స్ అవుతున్నాయి. రెమ్యునరేషన్స్ పెంచేస్తున్నా కలెక్షన్స్ మాత్రం రావట్లేదు అని ఇండైరెక్ట్ గా కథలు లేకుండా సినిమాలు చేస్తున్నారని అన్నారు.

Anil Sunkara : ఈ రోజుల్లో ఇలా సినిమా ఫెయిల్ అయింది అని ఒప్పుకునే ప్రొడ్యూసర్స్ ఎంతమంది?

ఇప్పుడు అనిల్ సుంకర కూడా స్క్రిప్ట్ లేకుండానే సినిమా తీశాం అనడంతో టాలీవుడ్ డైరెక్టర్స్ తప్పు చేస్తున్నారా అని ప్రశ్నలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాతలు, మెగాస్టార్ కూడా డైరెక్టర్స్ మీద కామెంట్స్ చేయడంతో నిజంగానే డైరెక్టర్స్ పూర్తి బౌండ్ స్క్రిప్ట్ లేకుండా, కథ లేకుండా సినిమాలు తీద్దామనుకునుంటున్నారా? అసలు ఏ ధైర్యంతో ఇలా సినిమాలు చేస్తున్నారు? నిర్మాతల డబ్బులు కోట్లకు కోట్లు ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారు అంటూ టాలీవుడ్ డైరెక్టర్స్ మీద అభిమానులు, పలువురు టాలీవుడ్ పెద్దలు, ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి డైరెక్టర్స్ ఎందుకు ఈ తప్పు చేస్తున్నారో? తెలిసి చేస్తున్నారా? లేక తెలీక చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఏది ఏమైనా ఇలా కథ, బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమాలు చేయడం పెద్ద తప్పే. ఈ విషయంలో నిర్మాతలే ఎక్కువ నష్టపోతారు. అభిమానుల ఫీలింగ్స్ కూడా హర్ట్ అవుతాయి.