Anil Sunkara : ఈ రోజుల్లో ఇలా సినిమా ఫెయిల్ అయింది అని ఒప్పుకునే ప్రొడ్యూసర్స్ ఎంతమంది?

నిర్మాత అనిల్ సుంకర అభిమానులకు క్షమాపణ చెబుతూ ఏజెంట్ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకుంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో కొంతమంది అసలు స్క్రిప్ట్ ఫైనల్ చేయకుండా సినిమా ఎలా తీశావు అని విమర్శించినా చాలా మంది అనిల్ సుంకరని అభినందిస్తున్నారు.

Anil Sunkara : ఈ రోజుల్లో ఇలా సినిమా ఫెయిల్ అయింది అని ఒప్పుకునే ప్రొడ్యూసర్స్ ఎంతమంది?

Appreciations on anil sunkara for accepting agent movie failure

Anil Sunkara :  అక్కినేని అఖిల్, సాక్షి వైద్య(Sakshi Viadya) జంటగా, మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్. అఖిల్ అక్కినేని(Akhil Akkineni) మొదటి సారి ఫుల్ మాస్, యాక్షన్ రోల్ లో సిక్స్ ప్యాక్ బాడీ చేసి మరీ సినిమా చేశాడు. ఈ సినిమాపై అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అభిమానులను, ప్రేక్షకులను మెప్పిస్తుంది అనుకున్నారు అంతా. కానీ ఏప్రిల్ 28న రిలీజయిన ఏజెంట్ సినిమా అభిమానులని, ప్రేక్షకులని నిరాశపరుస్తూ డిజాస్టర్ గా మిగిలింది. కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాని పరిస్థితిలో ఏజెంట్ సినిమా ఉంది.

ఈ సినిమాని AK ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర నిర్మించాడు. ఇటీవల మూవీ ప్రమోషన్స్ లో సినిమా విజయంపై ధీమాగా మాట్లాడారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవ్వడంతో అఖిల్, నిర్మాత, దర్శకుడు అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకుంటున్నారు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర అభిమానులకు క్షమాపణ చెబుతూ ఏజెంట్ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకుంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

అనిల్ సుంకర తన ట్వీట్ లో.. ఏజెంట్ రిజల్ట్ పూర్తి బాధ్యత మేమే వహిస్తాం. ఇది ఒక పెద్ద రిస్క్ అని తెలిసి కూడా ముందుకి సాగాము. బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే కథ ఓకే చేసి పెద్ద మిస్టేక్ చేశాము. ఈ ప్రాజెక్ట్ మేకింగ్ చాలా తప్పులు, ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమా ఫెయిల్యూర్ కి రీజన్ చెప్పాలి అనుకోవడం లేదు, తప్పంతా మాదే. సినిమాపై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒకరికి హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఏజెంట్ విషయంలో జరిగిన తప్పులు మా భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో జరగకుండా చూసుకుంటామని తెలిపారు.

Karthi : పొన్నియిన్ సెల్వన్ 2 చూడటం కోసం జపాన్ నుంచి చెన్నైకి వచ్చిన కార్తీ ఫ్యాన్స్..

దీంతో కొంతమంది అసలు స్క్రిప్ట్ ఫైనల్ చేయకుండా సినిమా ఎలా తీశావు అని విమర్శించినా చాలా మంది అనిల్ సుంకరని అభినందిస్తున్నారు. అసలు ఈ రోజుల్లో సినిమా ఫ్లాప్ అయిందని ఎవరూ ఒప్పుకోవట్లేదు. సినిమా ఫ్లాప్ అయినా కూడా నెక్స్ట్ డేనే హిట్ అయిందంటూ కొంతమంది నిర్మాతలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అలాంటిది ఇన్ని సినిమాలు తీసిన మీరు సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోవడమే కాక ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. మీ లాంటి నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. మిమ్మల్ని చూసి మిగిలిన నిర్మాతలు నేర్చుకోవాలి. అసలు ఇలా ఇన్ని డబ్బులు పెట్టి సినిమా పోతే ఒప్పుకోవడానికి కూడా చాలా ధైర్యం ఉండాలి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా అనిల్ సుంకరని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. నిజంగానే ఈ రోజుల్లో సినిమా ఫ్లాప్ అయితే ఒప్పుకునే నిర్మాతలు ఎంతమంది ఉన్నారు. సినిమా ఫ్లాప్ అయినా సరే హిట్ అంటూ కొంతమంది సెలబ్రేషన్స్ కూడా చేసి ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అందుకే అనిల్ సుంకరని అభినందించడంలో తప్పులేదు.