Delhi Liquor Scam : కవితను జైల్లో వేయాలంటే ఈడీకి ఇంత టైమా?పేరంటానికి పిలిచారా?ఇదంతా బీఆర్ఎస్,బీజేపీ డ్రామాలు : రేవంత్ రెడ్డి
లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న చాలామందిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు..కానీ బీఆఎస్ ఎమ్మెల్సీ కవితను మాత్రం జైల్లో వేయటానికి ఈఢీ ఇంత సమయం తీసుకుంటుందేంటీ? కవితను పేరంటానికి పిలిచినట్లుగా డ్రామాలాడుతున్నారు అంటూ తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

TPC Revanth Reddy criticizes Kavita ED for not arresting her in Delhi liquor scam
Delhi Liquor Scam : లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న చాలామందిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు..కానీ బీఆఎస్ ఎమ్మెల్సీ కవితను మాత్రం జైల్లో వేయటానికి ఇంత సమయం తీసుకుంటారా? అంటూ తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే 11మందిని అరెస్ట్ చేశారు. కానీ కవితను మాత్రం అరెస్ట్ చేయటానికి ఇంత సమయం తీసుకుంటారా? ఇదంతా బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలు అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు సంధించారు. కవితను ఈడీ విచారణకు పిలిచినట్లుగా లేదు ఏదో పేరంటానికి పిలిచినట్లుగా చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఈడీ తలచుకుంటే కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపటానికి ఎంతో సమయం పట్టదు. కానీ బీజేపీ డ్రామాలతో ఈడీ మాత్రం కవితను పేరంటానికి పిలిచినట్లుగా విచారణ పేరుతో గంటలతరబడి కూర్చోపెట్టి తాత్కారం చేస్తోంది అని అన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ ఆడే డ్రామాలు ఇవన్నీ..బయటకు మాత్రం బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలపై విమర్శలు చేస్తుంటారు..బీజేపీ కూడా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుంది..కానీ ఇద్దరు ఒక్కటే లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే 11మందిని అరెస్ట్ చేశారు..ఢిల్లీ డిప్యూటీ సీఎంనే అరెస్ట్ చేశారు. కానీ కవితను అరెస్ట్ చేయకుండా డ్రామాలాడుతున్నారని ఇవన్నీ బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడే డ్రామాలని ఎద్దేవ చేశారు రేవంత్ రెడ్డి. కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుంది. బీఆర్ఎస్ ఆందోళన చేస్తే బీజేపీ రోడ్డెక్కుతుంది ఇదంతా ప్రశాంత్ కిషోర్ చేసే జిమ్మిక్కులని ఇవొక రాజకీయ స్ట్రాటజీలు అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు.
Delhi Liquor Scam : మోదీ జిందాబాద్ అంటే కవితను వదిలేస్తారు లేదంటే.. జైల్లో వేస్తారు : సీపీఐ నారాయణ