Delhi Liquor Scam : కవిత ఈడీ విచారణపై సీఎం కేసీఆర్ ఆరా.. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్న గులాబీ బాస్

ల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. కవితను ఈడీ అధికారులు విచారణ చేస్తున్న అంశంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఈడీ విచారణ అంశాలను సీఎం కేసీఆర్ ఆరా తీశారు. కేసీఆర్ కు ఈ అంశాలకు సంబంధించి వివరించటానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఢిల్లీలో ఈడీ విచారణకు సంబంధించి ఏ చిన్న అంశాలపై ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని సీఎం కేసీఆర్ కు అందిస్తున్నారు.

Delhi Liquor Scam : కవిత ఈడీ విచారణపై సీఎం కేసీఆర్ ఆరా.. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్న గులాబీ బాస్

KCR's focus on Delhi Liquor Scam Kavitha ED investigation

Delhi Liquor Scam : ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. కవితను ఈడీ అధికారులు విచారణ చేస్తున్న అంశంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఈడీ విచారణ అంశాలను సీఎం కేసీఆర్ ఆరా తీశారు. కేసీఆర్ కు ఈ అంశాలకు సంబంధించి వివరించటానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఢిల్లీలో ఈడీ విచారణకు సంబంధించి ఏ చిన్న అంశాలపై ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని సీఎం కేసీఆర్ కు అందిస్తున్నారు.

ఈ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై తాను కవిత బినామీనని..ఆమే ఆదేశాల మేరకే తాను పనిచేస్తున్నానని ఈడీ విచారణలో పేర్కొన్నారు. దీంతో ఈడీ అధికారులు వెంటనే కవితకు నోటీసులు జారీ చేయటం..ఈరోజు ఢిల్లీలో విచారించటం జరుగుతోంది.దాదాపు రెండు గంటలనుంచి ఐదుగురు ఈడీ అధికారుల బృందం కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు..

Delhi Liquor Scam : మోదీ జిందాబాద్ అంటే కవితను వదిలేస్తారు లేదంటే.. జైల్లో వేస్తారు : సీపీఐ నారాయణ

కవితపై ఈడీ ప్రశ్నలు ఇలా..
లిక్కర్ స్కామ్ లో మీ పాత్ర ఉందా?
ఇండో స్పిరిట్ లో మీరు పెట్టుబడులు పెట్టారా?
ఆప్ నేత విజయ్ నాయర్ ను మీరు కలిశారా? రామచంద్ర పిళ్లై మీ బినామీనా? అతను నా మనిషే ఆయనతో లావాదేవీలు జరపవచ్చు అని చెప్పారా?

మీకు ఆప్ నేత మనీశ్ సిసోడియాకు మధ్య వ్యాపార అవగాహన ఉందా?
ఇండో -స్పిరిట్ లో 32.5 శాతం వాటా ఎవరిది? మీకు ఉందా?
ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి కుటుంబం..శరత్ చంద్రారెడ్డితో మీకున్న సంబంధాలేంటీ?

ఇలా పలు అంశాలపై పలు కోణాల్లో ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా సమాచారం.

Delhi Liquor Scam MLC kavitha : తండ్రి కేసీఆర్ లక్కీ నంబర్ ‘6’ తోనే ఈడీ విచారణకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత