Tiger Crosses Road: నా దారి రహదారి.. నేనొస్తే సిగ్నల్ పడాల్సిందే..! రోడ్డుపై పులిదర్జా చూడండి..

వాహనదారులు అడవి మార్గంలో రహదారిపై ప్రయాణించే సమయంలో అప్పుడప్పుడు అడవి జంతువులు తారసపడుతుంటాయి. వాటిని చూసి భయంతో వాహనాన్ని వెనక్కి తిప్పడమో, లేక ఆ అడవి జంతువు పోయే వరకు వేచి ఉండి వెళ్లడమో చేస్తుంటాం. ఒక్కోసారి రోడ్డుపై వచ్చే వాహనాలను చూసి అడవి జంతువులే అక్కడి నుంచి పరారవుతాయి.. కానీ, ఇక్కడ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కానీ ఇక్కడ పోస్టు చేసిన వీడియోలో రహదారిపై ఓ పులి వీఐపీలా వెళ్లడం గమనించవచ్చు.

Tiger Crosses Road: నా దారి రహదారి.. నేనొస్తే సిగ్నల్ పడాల్సిందే..! రోడ్డుపై పులిదర్జా చూడండి..

Tiger

Tiger Crosses Road: వాహనదారులు అడవి మార్గంలో రహదారిపై ప్రయాణించే సమయంలో అప్పుడప్పుడు అడవి జంతువులు తారసపడుతుంటాయి. వాటిని చూసి భయంతో వాహనాన్ని వెనక్కి తిప్పడమో, లేక ఆ అడవి జంతువు పోయే వరకు వేచి ఉండి వెళ్లడమో చేస్తుంటాం. ఒక్కోసారి రోడ్డుపై వచ్చే వాహనాలను చూసి అడవి జంతువులే అక్కడి నుంచి పరారవుతాయి.. కానీ, ఇక్కడ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. అడవిలో నుంచి పులి రోడ్డుపైకి వచ్చే క్రమంలో రహదారిపై వెళ్లే వాహనాలను ఓ వ్యక్తి నిలిపివేస్తాడు. పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ పడినట్లుగా వాహనాలు ఆగిపోవటంతో పులి రోడ్డుపైకి వచ్చి వీఐపీ వెళ్తున్నట్లు.. దర్జాగా రోడ్డు దాటుతుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.

Batsman Forgets Pads: అయ్యయ్యో.. ప్యాడ్లను మర్చిపోయానా..! ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

పర్వీన్ కస్వాన్ నిత్యం తన ట్విటర్ ఖాతాలో నెటిజన్లను ఆశ్చర్యపర్చే వీడియోలను పోస్టు చేస్తుంటాడు. ముఖ్యంగా అడవి జంతువుల గురించి అవగాహన పెంచడం నుంచి వివిధ అడవి జంతువుల గురించి మాట్లాడుకొనేలా అతని ట్వీట్లు ఉంటాయి. తాజాగా అతను ఓ వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోలో వీఐపీలు వచ్చేటప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఎలా వాహనాలను నిలిపివేస్తారో.. అలా అడవిలో నుంచి రోడ్డుపైకి పులి వచ్చేటప్పుడు ఓ వ్యక్తి రహదారిపై వాహనాలను నిలిపివేస్తుండటం గమనించవచ్చు. ఆ తరువాత పులి నెమ్మదిగా రోడ్డుపైకి వచ్చి.. నేను వీఐపీని అన్నట్లుగా దర్జాగా రోడ్దుదాటుతుండటం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోకు ‘పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్.. ఈ వ్యక్తులకు తెలియని లొకేషన్’ అనే శీర్షిక ఇచ్చారు.

ఈ వీడియో పోస్టు చేసిన ఒక్కరోజులోనే 81వేల మందికంటే ఎక్కువగా నెటిజన్లు వీక్షించారు. దాదాపు 5వేల మంది వీడియో సూపర్ అంటూ లైక్ చేయగా, అనేక మంది నెటిజన్లు రీ ట్వీట్లు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లు బైక్ నంబర్ ప్లేట్ ద్వారా తెలుస్తోంది. ఓ నెటిజన్ తన ట్వీట్ లో “ఆశ్చర్యం! మేము కనీసం ఒక పులిని చూసేందుకు సఫారీలో దట్టమైన అడవిలో తిరుగుతాము … కానీ ఎల్లప్పుడూ జాడ లేకుండా తిరిగి వస్తాము! ఇదిగో… ఈ మృగం చాలా తేలికగా హైవేని దాటుతూ ప్రయాణీకుల వైపు చూస్తోంది. ఇది సాధారణ వ్యవహారంలా కనిపిస్తోంది’అంటూ పేర్కొన్నాడు.