Hyderabad : హైదరాబాద్‌లో విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కొని వ్యక్తి మృతి

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4లో ఉన్న GIS హోటల్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న శివాజీ గణేష్ లిఫ్ట్‌లో ఇరుక్కొని మృతి చెందాడు.

Hyderabad : హైదరాబాద్‌లో విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కొని వ్యక్తి మృతి

Hyderabad

Hyderabad : హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఓ హోటల్ లో విషాదం చోటుచేసుకుంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4లో ఉన్న GIS హోటల్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న శివాజీ గణేష్ లిఫ్ట్‌లో ఇరుక్కొని మృతి చెందాడు. 29 సంవత్సరాల గణేష్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ముద్దం అనే తండాకు చెందిన శివాజీ 2019లో హైదరాబాద్ వచ్చాడు.

చదవండి : Hyderabad : సెల్ఫీ తీసుకుని స్కూటర్ స్టార్ట్ చేసుకోవచ్చు

బంజారాహిల్స్‌లో జీఐఎస్ హోటల్లో సూపర్ వైజర్‌గా చేరాడు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో లిఫ్ట్ పాడవడంతో హోటల్ యజమాని లిఫ్ట్ చూడమని చెప్పాడు. దీంతో లిఫ్ట్ గదిలోకి దిగి చూస్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ ఆన్ అయింది. లిఫ్ట్ కిందకు రావడంతో బయటకు వచ్చే మార్టం క్లోస్ అయింది.

చదవండి : Hyderabad : ఇదేం డ్రైవింగ్‌ సామి.. స్కూటీని ఇలా కూడ నడపొచ్చా?

దీంతో మధ్యలో ఇర్రుక్కుపోయాడు గణేష్. ఇరుక్కుపోయి కిందదాకా లిఫ్టుతో పాటు రావడంతో మృతిచెందాడు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్‌కి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.