High Court : మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టులో విచారణ..సీబీఐకి అప్పగించే అంశంపై తీర్పు రిజర్వ్

మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తైంది. ఈ కేసులో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హైకోర్టుకు హాజరయ్యారు.

High Court : మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టులో విచారణ..సీబీఐకి అప్పగించే అంశంపై తీర్పు రిజర్వ్

Mariamma (1)

Mariamma Lockup Death case : మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తైంది. ఈ కేసులో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హైకోర్టుకు హాజరయ్యారు. కేసును సీబీఐకి అప్పగిస్తే పోలీసులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని ఏజీ.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో ఇద్దరు పోలీసులను విధుల్లో నుంచి తొలిగించామని ఏజీ తెలిపారు. ఈ వాదనలను విన్న హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించే అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన అడ్డగూడూరు మరియమ్మ లాక్ డెత్ పై ఇవాళ హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలా లేదా అనే అంశంపైనే ప్రధానంగా తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ప్రస్తుతం తీర్పును రిజర్వ్ చేసింది.

Chandrababu : మూడు రాజధానుల బిల్లు రద్దుపై స్పందించిన చంద్రబాబు

అడ్వకేట్ జనరల్ ఇవాళ హైకోర్టుకు మరోసారి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐ, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని, వారిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించామని చెప్పారు. కానీ ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకున్నారని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది.

వారిపై సెక్షన్ 174 సస్పెక్టెడ్ డెత్ తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టామని, వారిపై సెక్షన్ లు కూడా నమోదు చేశామని ఏజీ కోర్టుకు విన్నవించారు. ఈ కేసును సీఐడీ, స్పెషల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీలకు ఇవ్వాలని, ఎట్టిపరిస్థితుల్లో సీబీఐకి ఇవ్వకూడదని ఏజీ..కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు.