Tribal Woman Fight : బిడ్డ కోసం తల్లి సాహసం.. ఒంటి చేత్తో చిరుతపై పోరాటం

ఇంటి బయట ఉన్న బిడ్డను చిరుత లాక్కెళ్ళింది. తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి చిరుతతోనే ఫైట్ చేసింది.

Tribal Woman Fight : బిడ్డ కోసం తల్లి సాహసం.. ఒంటి చేత్తో చిరుతపై పోరాటం

Tribal Woman Fight (2)

Tribal Woman Fight : బిడ్డకు ఆపద వచ్చిందంటే తల్లి హృదయం తల్లడిల్లుతోంది. తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆపదలో ఉన్న బిడ్డలను కాపాడుతుంది. చేతులనే ఆయుధాలుగా చేసుకొని అపర కాళీమాతలుగా ఉగ్రరూపం దాల్చి ఆగంతకులు, దొంగల నుంచి తమ బిడ్డలను కాపాడుకున్న ఘటనలు కోకొల్లలు. అయితే ఓ తల్లి ఇంతకంటే గొప్ప సాహసం చేసింది. ఓ చిరుత తన బిడ్డను ఎత్తుకెళ్ళడంతో ప్రాణాలకు తెగించి తన బిడ్డను రక్షించుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

చదవండి : Madhya Pradesh : స్కూల్ బస్సు మిస్.. చెట్టుకు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య!

వివరాల్లోకి వెళితే.. సిధి జిల్లాలోని సంజయ్ టైగర్ జోన్‌లోని ఝరియా అనే గ్రామంలో శంకర్ బైగా, కిరణ్ బైగా తమ ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఓ రోజు సాయంత్రం కిరణ్ బైగా తన పిల్లలతో కూర్చొని చలిమంట కాగుతుంది. ఇంతలోనే ఓ చిరుత అక్కడికి వచ్చి తన కుమారుడు రాహుల్ (8)ని నోటకరచి అడవిలోకి లాక్కెళ్ళింది.

చదవండి : Madhyapradesh : రాక్షస తండ్రి, కూతురిపై హత్యాచారం

ఈ హఠాత్ పరిణామంతో ఉలిక్కిపడ్డ కిరణ్ బైగా మిగతా ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పెట్టి.. తన కుమారుడిని రక్షించుకునేందుకు అడవిలోకి వెళ్ళింది. చేతిలో ఆయుధం లేకుండా కేకలు వేస్తూ పరుగులు తీసింది. తన కుమారుడిని చిరుత ఓ పొదలోకి లాక్కెళ్ళింది గుర్తించి అక్కడికి వెళ్ళింది. అడవిలో దొరికిన కర్రతో చిరుత వైపుకు దూసుకెళ్లింది. ఆమెను గమనించిన చిరుత పిల్లాడిని వదిలేసి కొద్దీ దూరం వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి వచ్చి మహిళపై దాడి చేసింది.

చదవండి : Madhya Pradesh : ఆవుల పేడ, మూత్రంతో ఆర్థిక వ్యవస్థకు ఊతం శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

చేతులో ఉన్న కర్రతో కొద్దీ నిమిషాల పాటు చిరుతను నిలువరించింది కిరణ్ బైగా.. ఈ లోపే గ్రామస్తులకు విషయం తెలియడంతో వారు వెతుక్కుంటూ అడవిలోకి వచ్చారు. గ్రామస్తులను గుంపుగా వస్తున్న జనాలను చూసి భయపడిన చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనలో పిల్లాడు రాహుల్ కు స్వల్ప గాయాలు కాగా.. కిరణ్ బైగా చేతికి బలమైన గాయమైంది. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

చదవండి : Madhya Pradesh : భోపాల్‌లో దుర్గామాత భక్తులపై దూసుకెళ్లిన కారు

ఇక విషయం అటవీ అధికారులకు తెలియడంతో ఆమె సాహసాన్ని ప్రశంసించి.. తక్షణ సాయం కోసం ఆమెకు వెయ్యి రూపాయలు ఇచ్చారు.