TRS MLC: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ లిస్ట్.. మూడు సీట్లు.. రేసులో నలుగురు!

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ జాబితా కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది.

TRS MLC: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ లిస్ట్.. మూడు సీట్లు.. రేసులో నలుగురు!

Trs Mlc

TRS MLC: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ జాబితా కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. ఈ మేరకు అభ్యర్థుల పేర్లను టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. ఈ జాబితాను కాసేపట్లో విడుదల చేయనున్నారు. ఇవాళ(16 నవంబర్ 2021) నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండడంతో తమ నామినేషన్లు సమర్పించనున్నారు అభ్యర్థులు.

ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులకు ప్రగతి భవన్‌ నుంచి ఫోన్‌ వెళ్లింది. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, కడియం శ్రీహరి, ఆకుల లలిత ప్రగతి భవన్‌లోనే ఉన్నారు. వీరిలో ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులకు సీఎం కేసీఆర్‌ బెర్త్‌ ఓకే చేసినట్లు సమాచారం.

వరంగల్‌ జిల్లా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్టీ జనరల్ సెక్రటరీ తక్కెళ్లపల్లి రవీందరావు, నల్గొండ జిల్లా నుంచి శాసన మండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ స్వయంగా వారికి ఫోన్లు చేసి సీట్లు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. పెండింగ్‌లోని మూడు స్థానాల కోసం నలుగురు రేసులో ఉన్నారు.

ఈ నలుగురు అభ్యర్థుల్లో ఒకరిని పక్కన పెట్టనండగా.. మాజీ స్పీకర్‌ మధుసూదనాచారిని గవర్నర్‌ కోటలో మండలికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన అభ్యర్థుల‌ను శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ నేత‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారు.

Pakistan: పాకిస్తాన్ కాబోయే ప్రధాని ఎవరు? ఇమ్రాన్ దిగిపోవడం ఖాయమేనా?