Pakistan: పాకిస్తాన్ కాబోయే ప్రధాని ఎవరు? ఇమ్రాన్ దిగిపోవడం ఖాయమేనా?

పాకిస్తాన్‌లో ఎప్పటిలానే ప్రధానిపై ఆర్మీకి కోపమొచ్చింది. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌ను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది అక్కడి ఆర్మీ.

Pakistan: పాకిస్తాన్ కాబోయే ప్రధాని ఎవరు? ఇమ్రాన్ దిగిపోవడం ఖాయమేనా?

Imran Khan

Pakistan: పాకిస్తాన్‌లో ఎప్పటిలానే ప్రధానిపై ఆర్మీకి కోపమొచ్చింది. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌ను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది అక్కడి ఆర్మీ. పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISI కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజమ్‌ను నియమించడమే ఇందుకు కారణంగా చెబుతుండగా.. ఇమ్రాన్ స్థానంలో కొత్త ప్రధాని ఎంపికకు ఆర్మీ తెరవెనక ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వారం రోజుల్లోపు ఈ మొత్తం వ్యవహారం కొలిక్కి రానుంది.

ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొంది.. మూడేళ్ల నుంచి పదవిలో ఉన్న ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై పాకిస్తాన్ ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఇమ్రాన్‌కు కష్టమొచ్చింది. నవంబర్ 20లోపు పదవికి రాజీనామా చేయాలని, లేదంటే తామే తప్పించేస్తామని అల్టిమేటం జారీచేసింది. ఇమ్రాన్ ఖాన్‌ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించిన ఆర్మీకి, ప్రధానికి కొంత కాలంగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది.

AP High Court: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా కె.మన్మధరావు, భానుమతిల పేర్లు!

ఈ క్రమంలోనే ఐఎస్‌ఐ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ నదీం అంజమ్‌ను ఆర్మీ చీఫ్ నియమించడం.. ఈ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ.. ఇమ్రాన్‌ఖాన్‌కు రెండు అవకాశాలు ఇచ్చింది. నవంబర్ 20లోపు ఇమ్రాన్ తనంతట తాను రాజీనామా చేయడం, లేదా ప్రతిపక్షం పార్లమెంట్‌లో ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాసం పెట్టడం. ఏ ఆప్షన్ అయినా ఇమ్రాన్ ఇంటికి వెళ్లడం ఖాయమే అంటున్నారు.

Amit Shah: వైసీపీపై పోరాడండి.. టీడీపీకి దూరంగా ఉండండి -అమిత్ షా

ఈ క్రమంలోనే ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్‌సాఫ్‌కి మిత్రపక్షాలుగా ఉన్న ముత్తహిదా ఖామి మూవ్‌మెంట్, పాకిస్తాన్ ముస్లిం లీగ్..వచ్చే వారంలోపు మద్దతు ఉపసంహరించుకుంటాయని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే..ఇమ్రాన్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోతుంది. ప్రభుత్వం పడిపోతుంది. PTIకి చెందిన పర్వేజ్ ఖట్టక్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ షాబాజ్ షరీఫ్ పేర్లు కాబోయే ప్రధాని రేసులో ఉన్నట్లుగా తెలుస్తుంది.