Amit Shah: వైసీపీపై పోరాడండి.. టీడీపీకి దూరంగా ఉండండి -అమిత్ షా

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాత మార్చేందుకు పని మొదలుపెట్టారు అమిత్ షా. తిరుపతిలో రెండు రోజులు పర్యటించిన షా.. ఢిల్లీకి వెళ్లేముందు రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

Amit Shah: వైసీపీపై పోరాడండి.. టీడీపీకి దూరంగా ఉండండి -అమిత్ షా

Ap Amith

Amit Shah: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాత మార్చేందుకు పని మొదలుపెట్టారు అమిత్ షా. తిరుపతిలో రెండు రోజులు పర్యటించిన షా.. ఢిల్లీకి వెళ్లేముందు రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సంధర్భంగా.. వైసీపీపై పోరాడండి.. టీడీపీకి దూరంగా ఉండండి.. ఏపీ బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపు ఇది.

2024లో అధికారం సాధించే దిశగా పనిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు. సమయానికి అనుగుణంగా ఇతర పార్టీల్లోనుంచి ముఖ్య నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలని అమిత్ షా సూచించారు. పొత్తులపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయొద్దని నేతలను ఆదేశించారు. తాజ్ హోటల్‌లో జరిగిన ఈ సమావేశానికి, ఎంపీలు జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుపాటి పురందరేశ్వరి, జి. సంతోష్, శివప్రకాశ్‌, సునీల్‌ ధియోదర్‌, సత్యకుమార్ హాజరయ్యారు.

రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది.. ఎన్నికల్లో ఎంత మేర ప్రభావి చూపిస్తోందనే అంశాలపై నేతలతో అమిత్‌షా చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు.. రెండున్నరేళ్లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపైనా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. బద్వేల్‌ ఉపఎన్నికలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.

వైసీపీ, టీడీపీలతో ఎలా వ్యవహరించాలన్నదానిపైనా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. అధికార వైసీపీపై పోరాడాలని, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి దూరంగా ఉండాలని అమిత్‌షా ఆదేశించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని, పాలనలో లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉందని, ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు అమిత్ షా.

Julia Hawkins : బామ్మా నువ్వు సూపర్.. 105 ఏళ్ల వయసులో వరల్డ్ రికార్డ్