AP High Court: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా కె.మన్మధరావు, భానుమతిల పేర్లు!

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులను నియమించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు లేఖ అందించింది.

AP High Court: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా కె.మన్మధరావు, భానుమతిల పేర్లు!

Ap High Court

AP High Court: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులను నియమించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు లేఖ అందించింది.

కె.మన్మధరావు పేరును సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.. బి.ఎస్.భానుమతికి హైకోర్టు జడ్జిగా పదోన్నతి ఇవ్వాలని సిఫారసు చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం.

ప్రస్తుతం జ్యుడీషియల్ అధికారిగా పనిచేస్తున్న బి.ఎస్.భానుమతిని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని ప్రతిపాదించింది. భానుమతి ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు.

గతంలో జిల్లా కోర్టుల్లో జడ్జిగా ఆమె వ్యవహరించారు. కాగా, ఢిల్లీ, కోల్‌కత్తా, కేరళ, ఛత్తీస్‌ఘడ్ హైకోర్టులకు కూడా న్యాయవాదులు, న్యాయాధికారులను న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది.

సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం నవంబర్ 11వ తేదీన ఈమేరకు సమావేశమై నిర్ణయం హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.