Palla Fire on Etala : ఈటలకు ఉన్నది ఆత్మగౌరవం కాదు..ఆస్తులపై గౌరవం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈటెలకు ఉన్నది ఆత్మగౌరవం కాదనీ..ఆస్తుల మీద గౌవరం విమర్శించారు. పార్టీ నుంచి బయటకెళ్లి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని..పార్టీ ఈటలకు ఇచ్చిన గౌరవాన్ని మరచిపోయి విమర్శలు చేయటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

Palla Fire on Etala : ఈటలకు ఉన్నది ఆత్మగౌరవం కాదు..ఆస్తులపై గౌరవం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Fire On Etala

TRS MLC Palla Fire on Etala Rajender : ఈటల రాజేందర్ పై గులాబీ నేతల గుర్రుమంటున్నారు. ఈటలపై భూకబ్జా ఆరోపణలు..అనంతరం మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్..ఈటెల ఢిల్లీ వెళ్లా బీజేపీ నేతలను కలవటం ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న క్రమంలో టీఆర్ఎస్ నేతలు..ఈటల మధ్యా మాటల హీట్ పెరిగింది. ఈ క్రమంలో తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్‌ పార్టీకీ కూడా రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఈటల ఈరోజు ప్రెస్ట్ మీట్ పెట్టి మరోసారి విమర్శలు చేస్తూ..‘తాను ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని..తనపై వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమే..కానీ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా నన్ను రాత్రి రాత్రే మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేశారు. నేను ఆత్మగౌవరం జీవిస్తున్నా..ఎట్టి పరిస్థితుల్లోను ఆత్మగౌరవాన్ని వదులుకోను..నేను మీ బానిసనకు కాదు నాకు ఆత్మగౌరవం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోనని వ్యాఖ్యానించారు. ఈటల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత‌లు మండిప‌డ్డారు.

ఈటలకు సీఎం కేసీఆర్ ఎంతో గౌరవాన్ని ఇచ్చారని..టీఆర్ఎస్‌ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గానూ..అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులతోను ఎప్పుడూ గౌరవాన్ని ఇచ్చారని ఈట‌ల‌కు కేసీఆర్ ఎన్నో గౌరవాన్ని ఇచ్చారని ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు పార్టీని విడిచిపెట్టి బైటకెళ్లి తల్లిలాంటి పార్టీ రొమ్ము గుద్దారని విమర్శించారు. ‘‘తనకు ప్రగతిభవన్ లోను..పార్టీలోను తగిన గౌరవం దక్కలేదని అవమానించారని ఈటల ఆరోపించటం ఎంత మాత్రం వాస్తవం కాదని..తనకు ఆత్మగౌరవం ఉందని ఈటల పదే పదే చెబుతున్నారు..కానీ ఈటలకు ఉన్నది ఆత్మగౌరవం కాదు..ఆస్తుల మీద గౌరవం‘‘ అంటూ పల్లా ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీఎం కేసీఆర్ ఆయనకు రెండు సార్లు మంత్రిగా అవ‌కాశం ఇచ్చార‌ని.. తెలంగాణ‌లో ఏ ప‌థ‌కం తీసుకురావాల‌ని చూసినా ఈట‌ల రాజేంద‌ర్‌కు సీఎం కేసీఆర్ చర్చించేవారని..అలా ఈటలకు పార్టీలో దక్కినంత గౌరవం మరే ఇతర నేతలకు దక్కలేదని ఈ విషయాన్ని ఈటల మరచిపోయారని తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం ఈటల అని విమర్శంచారు.ఈట‌ల‌ను పార్టీ ఎంత‌గానో గౌర‌వించిందని ఆయ‌న చెప్పారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి రానివ్వ‌లేద‌ని ఈట‌ల ఇప్పుడు చెబుతున్నారు..మ‌రి అప్పుడే ఎందుకు రాజీనామా చేయ‌లేదని పల్లా ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారని.. కేసీఆర్‌పై ఎన్నో అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈటలకు అత్యంత గౌరవాన్ని ఇచ్చినందుకు ప్రతిఫలంగా విమర్శలు చేస్తున్నారని ఇది ఎంతమాత్రం సరికాదని అన్నారు. గ‌తంలోనూ చాలా మంది నేత‌లు టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్తూ కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేశార‌ని ఇప్పుడు ఈట‌ల కూడా వారినే ఫాలో అవుతున్నారు. కానీ టీఆర్ఎస్ విడిచి బైటకెళ్లినా పార్టీకి ఎటువంటి నష్టం లేదనీ..అన్నారు.

పార్టీలో ఉన్న‌ప్పుడు కేసీఆర్ ని దేవుడు అనీ..పార్టీ నుంచి బయటకు వెళ్లి విమర్శలు చేస్తున్నారనీ..ఈటల కేసీఆర్ ను విమర్శిస్తే..సూర్యుడిపై ఉమ్మేసిన‌ట్టేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈట‌ల వెనుక ఉన్న‌ది కొంత మంది అసంతృప్తులు మాత్ర‌మే తప్ప ప్రజలు ఎవ్వరూ ఆయన వెనుక లేదని ఆ విషయాన్ని గుర్తించాలని సూచించారు. హుజురాబాద్ ప్ర‌జ‌లంద‌రూ టీఆర్ఎస్ వైపే ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.