CM KCR Delhi Tour : సమరమే… వస్తున్నా ఢిల్లీకి..

ఇప్పటివరకు తెలంగాణ నుంచే కేంద్రంపై యుద్ధం చేస్తున్న కేసీఆర్.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీకే వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

CM KCR Delhi Tour : సమరమే… వస్తున్నా ఢిల్లీకి..

Kcr Delhi Tour

CM KCR Delhi Tour :  ఇప్పటివరకు తెలంగాణ నుంచే కేంద్రంపై యుద్ధం చేస్తున్న కేసీఆర్.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీకే వెళ్లాలని డిసైడ్ అయ్యారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు డిమాండ్ చేయడంతో పాటు పార్లమెంటులోనూ టీఆర్ఎస్ ఎంపీలతో నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. ఇందుకోసం.. రేపు సోమవారం జరిగే టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు.

రాజకీయంగా ఢిల్లీపై దండెత్తాలని.. సీఎం కేసీఆర్ డిసైడ్ అయిపోయారు. కేంద్రాన్ని టార్గెట్ చేసేందుకు.. కేంద్రమే కొలువుదీరిన చోటుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వంపై పోరును ఉధృతం చేయడంతో పాటు ఇండియా అటెన్షన్‌ని ఢిల్లీ వైపు తిప్పేందుకు కేసీఆర్ పక్కా స్కెచ్‌తో హస్తినకు వెళ్తున్నారు. తెలంగాణలో పండిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు సీఎం కేసీఆర్.

దీనికి సంబంధించి చర్చించేందుకే.. 9 మంది మంత్రులతో.. ఎర్రవల్లిలో ఎమర్జెన్సీ మీటింగ్‌కు పిలిపించారు. కేంద్రంపై పోరుకు సంబంధించి.. మినిస్టర్లకు అన్ని వివరాలు తెలియజేశాక.. రేపు మార్చి 21 సోమవారం తెలంగాణ భవన్‌లో.. టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరపాలని.. గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయించారు.

ఈ సమావేశం తర్వాత.. సీఎంతో పాటు మంత్రుల బృందం.. అదే రోజు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనుంది. ధాన్యం కొనుగోళ్లపై.. కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. ఇదే సమయంలో.. తెలంగాణలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా.. లోక్ సభలో, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు.

పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్‌సిఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ.. ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇక.. సోమవారం జరగబోయే టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశానికి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్‌ల అధ్యక్షులు, రైతు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు కేసీఆర్.

రాష్ట్ర రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై.. ఈసారి ఉధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ సిద్ధమైంది. ఇప్పటివరకు.. తెలంగాణ నుంచే తన వాయిస్ వినిపించిన కేసీఆర్.. ఇక ఢిల్లీ వేదికగా కేంద్రంపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read :Fire Accident: కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. బూడిదైన సైక్లింగ్ పార్క్ గోదాం
అందులో భాగంగానే.. తానే ఢిల్లీకి వెళ్లి వరి కొనుగోళ్ల ఇష్యూని.. ఇండియాకు చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది. తెలంగాణ సీఎంగా.. ఢిల్లీలో ఆందోళన చేసి.. దేశం ముందు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంత్రులతో సమావేశం అవడానికి ముందు.. సీఎస్, ప్రభుత్వ ఉన్నతాధికారులతో.. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదలపై చర్చించారు.